CM Jagan: మహిళలకు పండగే.. అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి ‘ఆసరా’ నిధులు జమ చేసిన సీఎం జగన్
అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేందుకు సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం 'వైఎస్సార్ ఆసరా'. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే వేల కోట్ల రూపాలయను మహిళల ఖాతాల్లోకి జమ చేసిన జగన్ సర్కార్ ఇవాళ (మార్చి 25) మూడో విడత నిధులు విడుదల చేసింది.
అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేందుకు సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం ‘వైఎస్సార్ ఆసరా’. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే వేల కోట్ల రూపాలయను మహిళల ఖాతాల్లోకి జమ చేసిన జగన్ సర్కార్ ఇవాళ (మార్చి 25) మూడో విడత నిధులు విడుదల చేసింది. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన బహిరంగ కార్యక్రమంలో బటన్ నొక్కి రూ.6,419.89 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్ తమది మహిళా పక్షపాతి ప్రభుత్వమన్నారు. అలాగే రాష్ట్రంలోని పొదుపు సంఘాలు దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచాయని ప్రశంసలు కురిపించారు. ‘వైఎస్సార్ ఆసరా మూడో విడతలో భాగంగా రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి. ఈ పథకంలో ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిచి పెట్టాను. స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు ఉంటాయి. అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం. మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా ప్రభుత్వం నిలబడుతుంది. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. ఈ నిధులతో 9 లక్షల మందికిపైగా నా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. రూ.4355 కోట్లను బ్యాంకుల ద్వారా వారికి అనుసంధానం చేశాం. తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు లబ్ధిదారులు’
దేశానికే రోల్ మోడల్‌గా..
గతంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయి. 99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నాయి. తద్వారా దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయి. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం. ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నాం. చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుంది. ఎన్‌పీఏలు, ఓవర్ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమే. ఇది గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం. రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారు. వారిని నిలువునా ముంచేశారు. 2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారు. రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి దాపరించింది. మేం అధికారంలోకి వచ్చాక తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చాం. 2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించాం. చిక్కటి చిరునవ్వుతోనే ఇదంతా చేశాం. మహిళా పక్షపాత ప్రభుత్వం మనది’.
నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకే..
‘ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం. కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది. ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. దేవాలయాల ఛైర్మన్, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం. ఇందులో 1.17 లక్షల మంది రిజస్టర్ చేసుకున్నారు. 21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నా’ అని పేర్కొన్నారు సీఎం జగన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..