AP News: గ్రామ సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు..

రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ (sachivalayam employees) ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది.

AP News: గ్రామ సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు..
Ap Cm Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 16, 2022 | 5:05 PM

Village ward secretariat employees: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ (sachivalayam employees) ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. దీనికి సంబంధించి నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. సీఎం ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలను చెల్లించనున్నారు. కాగా.. జూలై 1 నుంచి పీఆర్సీ వర్తించనుంది.

కాగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..