Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sahara Darwaza: సూరత్‌లో సూపర్ బ్రిడ్జి.. దేశంలో మొదటి వంతెనగా రికార్డు.. సహారా దర్వాజా ప్రత్యేకతలు ఇవే..

దేశంలోనే అతిపెద్ద వంతెన అయిన సహారా దర్వాజా త్రిబుల్ లేయర్ బ్రిడ్జిను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు (ఆదివారం) నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు.

Sahara Darwaza: సూరత్‌లో సూపర్ బ్రిడ్జి.. దేశంలో మొదటి వంతెనగా రికార్డు.. సహారా దర్వాజా ప్రత్యేకతలు ఇవే..
Sahara Darwaza Bridge
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 16, 2022 | 3:45 PM

Sahara Darwaza multi-layer bridge: గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రవాణాపై దృష్టిసారించింది. తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా ప్రయాణాన్ని సుఖమయం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా సూరత్‌లో నిర్మించిన త్రిబుల్ లేయర్ వంతెన అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతిపెద్ద వంతెన అయిన సహారా దర్వాజా త్రిబుల్ లేయర్ బ్రిడ్జిను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు (ఆదివారం) నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు. ఇప్పటికే సూరత్‌లో 118 ఫ్లైఓవర్‌లు ఉండగా.. 119వ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నట్లు బీజేపీ నేత ధావల్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. వంతనెల నగరంలో మరో బ్రిడ్జి అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. భారతదేశంలో మొదటి త్రిబుల్ లేయర్ (మూడు పొరల వంతెన) 18 జూన్, 2022న సూరత్‌లో ప్రజా రావాణా కోసం తెరవనున్నట్లు వెల్లడించారు. సూరత్‌లోని అత్యంత రద్దీగా ఉండే రింగ్‌రోడ్‌ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండటంతో ట్రాఫిక్ సమస్య భారీగా తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను తగ్గించడానికి సహారా దర్వాజా బహుళ-పొర వంతెనను నిర్మించారు. వచ్చే ఆదివారం సహారా దర్వాజా బహుళ-పొర వంతెన ప్రారంభోత్సవంతో పాటు రింగ్ రోడ్ ఫ్లైఓవర్‌పై రాకపోకలకు అనుమతించనున్నారు.

ఈ వంతెనను బీజేపీ గుజరాత్ యూనిట్ చీఫ్ సీఆర్ పాటిల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినోద్ మొరాదియా, కేంద్ర మంత్రి దర్శన జర్దోష్ ఈ వంతెనను ప్రజలకు అంకితం చేసే అవకాశం ఉంది. హైవేకి అనుసంధానంగా సహారా దర్వాజా బహుళస్థాయి వంతెనను నిర్మించారు. సూరత్-కడోదర రహదారి వైపు వెళ్లే వాహనాలు కూడా సహారా దర్వాజా జంక్షన్ మీదుగా వెళతాయి. సూరత్-కడోదర రహదారిపై బాంబే మార్కెట్ వంటి మార్కెట్లు రావడంతో సహారా దర్వాజా జంక్షన్ వద్ద ట్రాఫిక్ పరిస్థితి మరింత తీవ్రమైంది.

ఇవి కూడా చదవండి

దీంతోపాటు సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (SMC) ఈ రైల్వే-మల్టీ-లేయర్ ఫ్లైఓవర్‌ను 133 కోట్ల రూపాయల వ్యయంతో రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించడానికి నిర్మించింది. సహారా దర్వాజా ఫ్లైఓవర్‌లో వరచ్చా ప్రాంతం నుంసీ సూరత్-కామ్రెజ్ రహదారికి వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక ర్యాంప్ కూడా ఉంది. ఇది నగరంలోని వరచ్చా ప్రాంతం గుండా రింగ్ రోడ్డు నుంచి సూరత్-కామ్రేజ్ రహదారి వైపు వెళ్లే వాహనాలకు కనెక్టివిటీని అందిస్తుంది. ఈ వంతెనతో రైల్వే స్టేషన్ నుంచి సూరత్-కడోదర రహదారి వైపు, సూరత్-ముంబై మార్గంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణం సౌకర్యవంతం కానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..