CM Jagan: వర్షాల కొరతపై సీఎం జగన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలంటూ అదేశాలు జారీ..

CM Jagan: ఏపీలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు  ముఖ్యమంత్రి జగన్‌. ఈ-క్రాప్‌ నమోదు, కనీస మద్దతు ధర, పశువులకు దాణా , వర్షాల కొరత నేపథ్యంలో పంటల ప్రత్యామ్నాయ ప్రణాళిక వంటి అంశాలపై చర్చించారు.

CM Jagan: వర్షాల కొరతపై సీఎం జగన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలంటూ అదేశాలు జారీ..
CM Jagan's Review Meet
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 02, 2023 | 8:21 AM

అమరావతి, సెప్టెంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల కొరత నేపథ్యంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అంబటి రాంబాబు, సీదిరి అప్పల రాజు, సీఎస్‌ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. జూన్‌ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన వర్షం కన్నా 25 శాతం వర్షాలు తక్కువగా కురిసినట్లు చెప్పారు. ఉభయ గోదావరి, రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైందని వెల్లడించారు. వర్షాల కొరత ఉండటంతో సీఎం జగన్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ- క్రాప్‌ నమోదుపై ప్రత్యేక చొరవ, పశువులకు దాణా, గ్రాసం, పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఇవే కాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశపెట్టాలని, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలో కరెంట్‌ డిమాండు, పంపిణీలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. గతేడాది పోలిస్తే గ్రిడ్‌ నుంచి డిమాండ్‌ కనీసంగా 18శాతం వరకూ పెరిగిందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అలాగే వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత రాష్ట్రంలో 3.3 లక్షల కనెక్షన్లు రైతులకు ఇచ్చామని వెల్లడించారు. గాలి లేకపోవడంతో విండ్‌ పవన్‌ గణనీయంగా తగ్గిందని, తడి బొగ్గు రావడంతో సామర్థ్యం మేరకు థర్మల్‌ కేంద్రాలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. పొడి వాతావరణం, వేసవిని తలపించేలా పరిస్థితులు ఉండటంతో అనూహ్యంగా ఈ డిమాండ్‌ వచ్చిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అయితే ఎంత ఇబ్బంది ఉన్నా.. అన్నదాతలకు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..