TDP Mahanadu 2025: వారికి శిక్షలు తప్పవు.. ఏపీ అభివృద్ధికి సైనికుడిలా పోరాటం చేస్తా: సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్
కడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది.. ముందుగా.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది.. ముందుగా.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుడిలా పోరాటం చేస్తానని.. పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఆంధ్ర ప్రధేశ్ భవిష్యత్‌ను మారుస్తానని చెప్పారు. రాజకీయాల్లో టీడీపీ ట్రెండ్ సెట్టర్ అని.. టీడీపీ అంటే దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ అన్నారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా.. అధికారంలోకి వచ్చాక అవినీతి రహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపార్టీలో చూసినా తెలుగు దేశం యూనివర్సిటీ నుంచి వెళ్లిన నాయకులే ఉంటారని.. టీడీపీ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు చంద్రబాబు.
జగన్ పాలనలో అవినీతిపై విచారణలు జరుగుతున్నాయని.. తప్పుచేసిన వైసీపీ నాయకులు, అధికారులకు శిక్షలు తప్పవన్నారు చంద్రబాబు. వైసీపీ నాయకుల అవినీతి సొమ్మును కక్కిస్తామని మహానాడు వేదికగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో అవినీతి అంతం కోసం పెద్ద నోట్లను రద్దు చేయాలని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు.
లైవ్ చూడండి..
కడపలో టీడీపీ మహానాడులో ముందుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రసంగించారు. 2019లో ఓడిన మంగళగిరిలో మళ్లీ గెలిచి లోకేష్ నాయకత్వాన్ని నిరూపించుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అనుభవం లోకేష్ యువనాయకత్వంలో..ఎన్టీఆర్ ఆశీస్సులతో టీడీపీ ముందుకెళ్తోందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినపుడు.. పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పోరాడారు.. మహానాడులో ఏపీ దశ, దిశ మార్చే తీర్మానాలు చేయబోతున్నామని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
