Crime News: గుండెపోటు కాదు.. కట్టుకున్న భార్యే కడతేర్చింది.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jul 30, 2021 | 4:32 PM

Crime News: చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో అటెండర్‌ వాసు అనుమానాస్పద మృతి కేసులు పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే అతన్ని..

Crime News: గుండెపోటు కాదు.. కట్టుకున్న భార్యే కడతేర్చింది.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
Murder Case

Follow us on

Crime News: చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో అటెండర్‌ వాసు అనుమానాస్పద మృతి కేసులు పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే అతన్ని అత్యంత కిరాతకంగా చంపేసిందని తేల్చారు. గుండెపోటుతో చనిపోయాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదు పూర్తి అవాస్తమవమని నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో వాసు, తన భార్య స్వప్నప్రియ నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు వినయ్ ఉన్నాడు. కొడుకు ఊర్లోనే ఉంటున్నాడు. కాగా, వాసు జిల్లా కలెక్టరేట్‌లో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, స్వప్నప్రియ.. మణిగండన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలిసిన వాసు పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా అతన్ని అడ్డుతొలగించుకోవాలని భావించిన స్వప్నప్రియ.. ప్రియుడు మణి గండన్‌తో కలిసి వాసు హత్యకు ప్రణాళికలు రచించింది. పథకం ప్రకారం అప్పటికే ఇంట్లో రెడీగా ఉన్న మణి గండన్, స్వప్న ప్రియ.. వాసు రాగానే అటాక్ చేశారు. అతని మెడకు సెల్ ఫోన్ ఛార్జింగ్‌ వైర్‌ బిగించి ఊపిరి ఆడకుండా చేశారు. అత్యంత కిరాతకంగా చంపేశారు.

అయితే, వాసును చంపేసిన స్వప్నప్రియ.. తన భర్త వాసు గుండెపోటుతో మరణించాడంటూ కొడుకు వినయ్ కుమార్, బంధువులకు సమాచారం చేరవేసింది. మృతదేహాన్ని నేరుగా స్వగ్రామమైన అరిగిలవారి పల్లెకు తరలించింది. అయితే, తండ్రి వాసు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కొడుకు వినయ్.. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసును చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్త వాసుని హత్య చేయాలని భార్య స్వప్న ప్రియ పథకం ప్రకారం కుట్ర పన్నిందని పోలీసులు నిర్థారించుకున్నారు. ముందుగా వేసిన పథకం ప్రకారం.. ప్రియుడు మణిగండన్‌తో కలిసి భర్త వాసును చంపేసిందని తేల్చారు. వాసును చంపిన భార్య స్వప్నప్రియ, ఆమె ప్రియుడు మణి గండన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

ACB Raids: లంచం తీసుకుంటూ పట్టబడ్డ యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్.. గుట్ట కార్యాలయంలో కొనసాగుతన్న ఏసీబీ సోదాలు..!

Meerpet: మహిళ చెంప చెల్లుమనిపించిన మేయర్ భర్త.. రేషన్ కార్డు అడిగినందుకు..

AP Crime News: తాడేపల్లిలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన.. తాళాలు పగులగొట్టి తెరిచి చూడగా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu