AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: పదవులకు లోబడే వ్యక్తిని కాదు.. మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

Chiranjeevi Comments: రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని

Chiranjeevi: పదవులకు లోబడే వ్యక్తిని కాదు.. మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..
Megastar Chiranjeevi
Shaik Madar Saheb
|

Updated on: Jan 14, 2022 | 6:28 PM

Share

Chiranjeevi Comments: రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం ఏపీ సీఎం జగన్‌ను కలిశానని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై గురువారం మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో భేటి అయిన విషయం తెలిసిందే. ఆయన భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవికి అధికార వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలపై చిరంజీవి స్పందించారు. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు స్పష్టం చేశారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని.. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమేనన్నారు. అలాంటి వార్తలను చిరంజీవి ఖండించారు.

రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనంటూ తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని..అలాంటి ఉద్దేశం లేదన్నారు. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసమే సీఎంతో భేటీ అయ్యానని.. చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా ఆ మీటింగ్‌కు రాజకీయరంగు పులిమారన్నారు. తననురాజ్యసభకు పంపుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తాను మళ్ళీ రాజకీయాల్లోకి చట్టసభలకు రావటం జరగదన్నారు. దయచేసి ఊహాగానాలను నమ్మవద్దంటూ చిరు పేర్కొన్నారు. ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నానంటూ చిరంజీవి పేర్కొన్నారు.

Also Read:

RRR: ఫ్యాన్స్ కు సంక్రాంతి సర్‌ప్రైజ్ అందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కొత్త పోస్టర్‌..

AP Corona: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..!