AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఫ్యాన్స్ కు సంక్రాంతి సర్‌ప్రైజ్ అందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కొత్త పోస్టర్‌..

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు

RRR: ఫ్యాన్స్ కు సంక్రాంతి సర్‌ప్రైజ్ అందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కొత్త పోస్టర్‌..
Basha Shek
|

Updated on: Jan 14, 2022 | 6:02 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియా శరణ్‌, సముద్ర ఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో వాయిదా వేశారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. దీంతో ఈ లోటుని కాస్తైనా తీర్చడానికి చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

కాగా సంక్రాంతి, భోగి పండగ శుభాకాంక్షలతో మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ వింటేజ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజాలపై కర్రతో ఎన్టీఆర్ ఆకట్టుకుంటుంటే… ముఖంపై చిరునవ్వుతో చెర్రీ సూపర్బ్‌గా అనిపిస్తున్నాడు . ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పండగ వేళ విడుదలైన ఈ పోస్టర్‌కు ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ పాటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై వారం రోజులు గడిచేది. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు. కొత్త విడుదల తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Also Read:

Vishwak Sen: పిల్లను వెతికిపెట్టండి లేదా అమ్మాయిని పడేసేందుకు టిప్స్ చెప్పండంటోన్న విశ్వక్‌ సేన్‌.. అసలు విషయమేమిటంటే..

Ram Gopal Varma: నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి.. ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్స్‌..

Viral video: పిజ్జాపై మనసు పారేసుకున్న పిల్లి.. ప్రాధేయపడిన తీరు చూస్తే నవ్వాగదు..