AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: పిజ్జాపై మనసు పారేసుకున్న పిల్లి.. ప్రాధేయపడిన తీరు చూస్తే నవ్వాగదు..

చిన్నపిల్లల నుంచి పెద్దలు, కొంతమంది వృద్ధులు కూడా పిజ్జాను ఎంతో ఇష్టపడి తింటారు. అయితే ఓ పిల్లి కూడా పిజ్జాను ఇష్టపడింది. తినడానికి ఇవ్వమని దీనంగా వేడుకుంది

Viral video: పిజ్జాపై మనసు పారేసుకున్న పిల్లి.. ప్రాధేయపడిన తీరు చూస్తే నవ్వాగదు..
Basha Shek
|

Updated on: Jan 14, 2022 | 4:45 PM

Share

చిన్నపిల్లల నుంచి పెద్దలు, కొంతమంది వృద్ధులు కూడా పిజ్జాను ఎంతో ఇష్టపడి తింటారు. అయితే ఓ పిల్లి కూడా పిజ్జాను ఇష్టపడింది. తినడానికి ఇవ్వమని దీనంగా వేడుకుంది. ఈక్రమంలో పిజ్జా కోసం అభ్యర్థిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లతో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి చేతిలో ఉన్న పిజ్జాను చూడగానే నల్ల పిల్లి నోట్లో నీళ్లూరుతాయి. దీంతో పిజ్జాను ఇవ్వమని ప్రాధేయపడుతుంది. ఇందులో భాగంగా ముందరి కాళ్లతో నమస్కరిస్తూ పిజ్జాను తినడానికి ఇవ్వమని దీనంగా వేడుకుంటుంది.

కాగా ‘క్యాట్స్ ఆఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు పిల్లి తరఫునే క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ అందరికీ నమస్కారం. కొత్త ఫాలోవర్లందరికీ స్వాగతం. కొత్త వ్యక్తులందరికీ నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఈ సమయాన్ని వెచ్చించాలని అనుకున్నాను. నా పేరు వాడ్స్‌ వర్త్‌. నాకు అడుక్కోవడం చాలా ఇష్టం. నాకు జాక్స్‌, కట్లర్‌, మిస్టరీ అనే ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినప్పటి నుంచే తెగ వైరలవుతోంది. ఇప్పటివరకు 20 లక్షలకు పైగా వ్యూస్ ఈ వీడియోకు రావడం విశేషం. వీడియోను చూసిన నెటిజన్లు తమ పెంపుడు కుక్కలు, పిల్లల ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ క్యూట్‌ క్యాట్‌ ఫన్నీ వీడియోపై ఓ లుక్కేయండి..

Also Read:

Allu Arjun: సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు అందుకున్న బన్నీ.. సౌత్‌ ఇండస్ట్రీలోనే మొదటి హీరోగా..

Makar Sankranti 2022: మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్‌.. చిన్న పిల్లాడిలా మారిపోయిన చిరంజీవి..

Priyanka Jawalkar: కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్న టాక్సీవాలా భామ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)