AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makar Sankranti 2022: మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్‌.. చిన్న పిల్లాడిలా మారిపోయిన చిరంజీవి..

టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు

Makar Sankranti 2022: మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్‌.. చిన్న పిల్లాడిలా మారిపోయిన చిరంజీవి..
Mega Family
Basha Shek
|

Updated on: Jan 14, 2022 | 3:19 PM

Share

టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు వరుణ్‌ తేజ్‌. దీంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి.

కాగా పండగ కోసం చిరంజీవి, వరుణ్‌లిద్దరూ చెఫ్‌ మాస్టర్లుగా మారిపోయారు. తమ కుటుంబ సభ్యుల కోసం సరదాగా దోసెలు వేశారు. కాగా తన కంటే వరుణ్ వేసిన దోసె బాగా రావడంతో చిరు చిన్నపిల్లాడిలా అతనితో గొడవపడ్డారు. ‘అది సరిగా రాలేదు, నాకు కుళ్లు వచ్చేసింది. ఇది దోశ కాదు ఉప్మా’ అంటూ వరుణ్‌ వేసిన దోశను గరిటెతో చెడగొట్టాడు చిరంజీవి. కాగా ఈ వీడియోను ‘బాస్‌తో 101వ దోశ’ అన్న క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కాసేపటికే లక్ష పైచిలుకు వ్యూస్‌ వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఇక నిహారిక కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో భాగమైంది. ఇంటి ముందు ముగ్గులు, వరుణ్‌ దోశలతో సహా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న సన్నివేశాలనంతటినీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

Also Read: Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘బేబీ షార్క్’ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..

Online Jewellery Order: మీరు ఆన్‌లైన్‌లో నగలను ఆర్డర్‌ చేస్తున్నారా..? ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!

Chiranjeevi-Ravi Teja: రవితేజ రావణాసుర షూటింగ్ ప్రారంభం.. పోస్టర్ ను లాంచ్ చేసిన చిరంజీవి..