AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు అందుకున్న బన్నీ.. సౌత్‌ ఇండస్ట్రీలోనే మొదటి హీరోగా..

అల్లు అర్జున్‌.. 'పుష్ప' సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడీ టాలీవుడ్ ఐకాన్‌ స్టార్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బన్నీ చిత్రం

Allu Arjun: సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు అందుకున్న బన్నీ.. సౌత్‌ ఇండస్ట్రీలోనే మొదటి హీరోగా..
Allu Arjun
Basha Shek
|

Updated on: Jan 14, 2022 | 3:43 PM

Share

అల్లు అర్జున్‌.. ‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడీ టాలీవుడ్ ఐకాన్‌ స్టార్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బన్నీ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక బాలీవుడ్‌లో ఇప్పటికే ఏకంగా 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వంద కోట్ల వైపు దూసుకెళుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా విషయాలతో పాటు తన పిల్లలు, తదితర వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకుంటాడు. అందుకే అతనికి రోజు రోజుకి ఫాలోవర్స్‌ పెరిగిపోతున్నారు. ఈక్రమంలో సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు వారబ్బాయి. ఈ సంక్రాంతి నాటికి బన్నీ ఇన్ స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్లు చేరారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీనే కావడం విశేషం.

కాగా తనకు 15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ సంతోషంగా ఫీలయ్యాడు . తనపై అమితమైన ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ఫ్యాన్స్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ తో ట్విట్టర్‌ లోనూ బన్నీ ఫాలోయింగ్‌ మాములుగా లేదు. అక్కడ 6 మిలియన్ల మంది అతనిని అనుసరిస్తున్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. కాగా దక్షిణాది హీరోల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే బన్నీకి దగ్గర్లో ఉన్నాడు. ఈ టాలీవుడ్ రౌడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 14.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Also Read: Makar Sankranti 2022: మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్‌.. చిన్న పిల్లాడిలా మారిపోయిన చిరంజీవి..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం.. తప్పిన పెను ప్రమాదం..

Viral Video:ఓ టీచర్ కొంప ముంచిన వైరల్ వీడియో.. అటు ఉద్యోగం పాయే.. ఇటు భర్త వద్దనబట్టే.. ఇంతకీ ఏమైందంటే..

.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ