Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం.. తప్పిన పెను ప్రమాదం..

Bomb Found In Delhi Flower Market: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. ఎప్పుడూ రద్దీతో ఉండే ఘాజీపూర్‌ పూల మార్కెట్‌ సమీపంలో

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
Delhi Police

Bomb Found In Delhi Flower Market: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. ఎప్పుడూ రద్దీతో ఉండే ఘాజీపూర్‌ పూల మార్కెట్‌ సమీపంలో పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో ఓ బ్యాగు కనిపించగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం వారు బాంబు స్క్యాడ్‌కు సమాచారమిచ్చారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని పోలీసు అధికారులు వెల్లడించారు.

కాగా.. ఘాజీపూర్ మార్కెట్‌ సమీపంలోనే బాంబును కనుగొనడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహాయంతో బాంబును నిర్వీర్యం చేశారు.

Also Read:

UP Assembly Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నలుగురు మహిళలదే కీలక పాత్ర!

Tadepalligudem: పండుగ పూట విషాద వార్త.. చేపల లారీ బోల్తా..నలుగురు దుర్మరణం

Published On - 3:32 pm, Fri, 14 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu