Vishwak Sen: పిల్లను వెతికిపెట్టండి లేదా అమ్మాయిని పడేసేందుకు టిప్స్ చెప్పండంటోన్న విశ్వక్‌ సేన్‌.. అసలు విషయమేమిటంటే..

మాస్‌ కథలతో పాటు వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విశ్వక్‌సేన్‌. 2017లో ‘వెళ్లిపోమాకే’ అంటూ తెలుగు సినిమా

Vishwak Sen: పిల్లను వెతికిపెట్టండి లేదా అమ్మాయిని పడేసేందుకు టిప్స్ చెప్పండంటోన్న విశ్వక్‌ సేన్‌.. అసలు విషయమేమిటంటే..
Vishwak Sen
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2022 | 5:54 PM

మాస్‌ కథలతో పాటు వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విశ్వక్‌సేన్‌. 2017లో ‘వెళ్లిపోమాకే’ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆతర్వాత ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ తో తనలోని అసలైన నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇటీవల ‘పాగల్‌’ సినిమాతో యువతను ఆకట్టుకున్న విశ్వక్‌.. ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్ కుమార్‌ పాత్రలో నటిస్తున్నాడు విశ్వక్‌. కొద్ది రోజుల క్రితం ఈ హీరో పెళ్లి కోసం చింత మ్యారేజ్‌ బ్యూరోని సంప్రదించినట్లుగా ఓ అప్డేట్‌ని కూడా విడుదల చేశారు. తాజాగా మరో వెరైటీ అప్డేట్‌ని ట్విట్టర్‌ లో పంచుకున్నాడు విశ్వక్‌.

అందులో ‘ఇంకా రెండు రోజులే ఉంది. పిల్లని వెతికి పెట్టండి లేదా కనీసం అమ్మాయిని పడేయడానికి టిప్స్‌ అయినా చెప్పండి. వయసు 30 దాటేసింది. పొట్ట, జుట్టు ఇంకా ఎన్నో కష్టాలున్నాయి. ఇంకా రెండే రోజులుంది. ఒకే ఒక్క సంబంధం చూడండి. అల్లానికి పెళ్లాన్ని వెతికి పెట్టడంలో సాయం చేయండి. మీ సూచనలు, అభిప్రాయాలను #HelpAllamFindPellam హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకోండి’ అంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ను చూస్తుంటే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాకు సంబంధించి రెండు రోజుల్లో ఏదైనా టీజర్‌, సాంగ్‌ రిలీజ్‌ చేయనున్నారా? లేదా పిల్ల దొరికేసిందని హీరోయిన్‌ పాత్రను ఇంట్రడ్యూస్ చేయనున్నారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కాగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:

Ram Gopal Varma: నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి.. ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్స్‌..

Viral video: పిజ్జాపై మనసు పారేసుకున్న పిల్లి.. ప్రాధేయపడిన తీరు చూస్తే నవ్వాగదు..

Allu Arjun: సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు అందుకున్న బన్నీ.. సౌత్‌ ఇండస్ట్రీలోనే మొదటి హీరోగా..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..