Chiranjeevi: మీరు ఎల్లకాలం చల్లగా ఉండాలయ్యా! 28 ఏళ్లుగా అన్నదానం నిర్వహిస్తోన్న చిరంజీవి ఫ్యాన్స్
ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 28 ఏళ్లుగా అంతర్వేది కళ్యాణం లో నిర్విరామంగా అన్నదానం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్. చిరు పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 1998 నుంచి అన్నదానం నిర్వహిస్తున్నారు అరవపాలెం గ్రామానికి చెందిన యువకులు. ఇక నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల వారం రోజులు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఉచిత అన్నదానం నిర్వహిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.

రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తీర్థ మహోత్సవాల సందర్భంగా అన్నదానాలు ఇక్కడ పెద్ద హైలెట్ గా నిలుస్తాయి. కళ్యాణ మహోత్సవాలు జరిగే పది రోజులపాటు నిత్య అన్నదానం ఉచితంగా ఏర్పాటు చేస్తారు ఆయా స్వచ్ఛంద సంస్థల యజమాన్యాలు. బ్రాహ్మణ, క్షత్రియ శెట్టిబలిజ,వెలమ,కాపు ఇలా పలు ట్రస్ట్ సేవా సంఘాలు..అనేక పేర్లతో ఉచిత అన్నదానాలు చేయడం అంతర్వేది కళ్యాణ మహోత్సవంలో ఆనవాయితీగా వస్తున్న విధానం. అయితే లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో నిర్వహిస్తున్న అన్నదానం సత్రానికి మంచి గుర్తింపు ఉంది. సాధారణంగా ఇక్కడ కులాల పేరుతో అన్నదానాలు నిర్వహిస్తుంటే. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పేరుతో అన్నదానం నిర్వహించడంపై నిర్వాహకులను పలు అభినందిస్తున్నారు. తీవ్ర ఎండలో సుధీర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దైవ దర్శనం కోసం వచ్చి న వారికి కాదనకుండా రెండు పూటలా కడుపు నింపుతున్నారు రాజోలు నియోజకవర్గం అరవపాలెం గ్రామానికి చెందిన చిరు పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. చిరంజీవి పేరుతో అన్నదానం చేస్తు పలు ప్రశంసలు పొందుతున్నారు. గత 28 సంవత్సరాలుగా చిరంజీవి పేరుతో చిరంజీవి అన్నదాన సత్రం అంతర్వేది తీర్థంలో ఎంతోమంది అన్నార్ధ భక్తుల ఆకలి తీరుస్తోంది.
ఈ అన్నదానానికి అరవపాలెం గ్రామస్తులు,యువకులు ప్రోత్సాహం తో పాటు రాజోలు నియోజకవర్గం మెగా అభిమానులు కూడా స్వచ్ఛందంగా చందాలు వేసి ఈ అన్నదానాన్ని నిర్వహకు సహాయం కూడా చేస్తున్నారు. గత 28 ఏళ్లుగా నిర్విరామంగా అంతర్వేదిలో అన్నదానం చేసేవారు లేని సమయం నుండి చిరంజీవి పేరు మీద ఉదయం సాయంత్రం కూడా వేలాది మంది భక్తులకు అన్నదాన వితరణ చేస్తున్నారు చిరు పవన్ సేవా సమితి అరవపాలెం గ్రామానికి చెందిన యువకులు. దీనిపై నిర్వాహకుడు ఉలిశెట్టి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ‘ 1998లో ప్రారంభమైన చిరంజీవి అన్నదాన సత్రం ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ఆకలి తీరుస్తోంది. ఇప్పటికే ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి పలువురు మెగా అభిమానులు తీసుకువెళ్లారు కూడా. నా పేరు మీద నిర్వహిస్తున్న ఈ అన్నదానానికి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఉలిసెట్టి లక్ష్మణరావు అరవపాలెం గ్రామ యువకులకు అనేకసార్లు చిరంజీవి తన ముఖ్యమైన అభిమానుల ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపినట్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు రవణం స్వామి నాయుడు నిర్వాహకులు చిరంజీవి ద్వారా అభినందనలు కూడా తెలియజేశారు. ఇంకా మెగా అభిమానులు సహకరిస్తే నిత్య అన్నదానం కూడా ఏర్పాటు చేయడానికి మాకు ఎలాంటి సందేహం లేదు అంటున్నారు చిరు పవన్ సేవా సమితి అరవపాలెం యువకులు. కళ్యాణం జరిగే వారం రోజులపాటు సరిపడా సరుకులు, మంచినీళ్లు వాటర్ బాటిల్స్, అన్నదానం నిర్వహించడానికి సామాగ్రి, గ్రామంలో ఉన్న యువకులంతా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ముగిసే వరకు అక్కడే ఉండి స్వయంగా ఈ అన్నదానాన్ని నిర్వహించడం పై పలువురు అభినందిస్తున్నారు.

Chiranjeevi Fans
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..