Andhra News: మద్యం మానేయాలనుకున్నాడు.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.. అసలేం జరిగిందంటే..
మద్యానికి బానిసయ్యాడు.. చివరకు మానేయాలని నిర్ణయించుకున్నాడు.. అయితే.. మద్యం అలవాటు మానేందుకు ఓ నాటు వైద్యుడిని సంప్రదించి ప్రాణాలు కోల్పోయాడు... ఈ విషాదకరఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.. ప్రకాశం జిల్లా కంభంలో మద్యం మానుకునేందుకు ప్రయత్నించి ఓ యువకుడు విగతా జీవిగా మారాడు.

మద్యానికి బానిసయ్యాడు.. చివరకు మానేయాలని నిర్ణయించుకున్నాడు.. అయితే.. మద్యం అలవాటు మానేందుకు ఓ నాటు వైద్యుడిని సంప్రదించి ప్రాణాలు కోల్పోయాడు… ఈ విషాదకరఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.. ప్రకాశం జిల్లా కంభంలో మద్యం మానుకునేందుకు ప్రయత్నించి ఓ యువకుడు విగతా జీవిగా మారాడు.. మద్యానికి బానిసైనా సునీల్ అనే యువకుడు మద్యం మానుకునేందుకు ఓ నాటు వైద్యుడిని సంప్రదించాడు.. మద్యం మానేయాలని ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదని, మద్యం తాగాలన్న ఆలోచన రాకుండా ఉండేందుకు ఏదైనా మందులు ఇవ్వాలని కోరాడు. దీంతో నాటు వైద్యుడు ఓ పసరు మందు ఇచ్చాడు.. ఇది తాగితే మద్యం తాగబుద్ది కాదని.. దీంతో మానొచ్చంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు..
అయితే.. ఎలాగో మద్యం మానుకుంటున్నాను కదా అని అతిగా మద్యం తాగాడు సునీల్.. అదే మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో విచక్షణ కోల్పోయాడు… నాటు వైద్యుడు ఇచ్చిన పసరు మందులో మద్యం కలిపి తాగేశాడు.. ఇక అంతే ఒక్కసారిగా యువకుడు విగత జీవిగా మారాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో తాను పనిచేసే దుకాణంలోని ఓ గదిలో నిద్రించిన చోటే మృతి చెందాడు. ఆ తరువాత యువకుడిని గమనించిన మద్యం దుకాణ యజమాని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే సునీల్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
రాచర్ల మండలం అనుముల పల్లెకు చెందిన బొట్టే సునీల్ (27) కొద్దిగా రోజులుగా కంభం పట్టణంలోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నాడు… మద్యానికి అలవాటు పడ్డ సునీల్ మద్యం మానేయాలని నిర్ణయించుకుని నాటువైద్యుడు ఇచ్చిన పసరు మందులో మద్యం కలుపుకుని తాగడంతో అది విషంగా మారి మృతి చెందినట్టు భావిస్తున్నారు.. దుకాణ యజమాని ద్వారా సమాచారాన్ని అందుకున్న పోలీసులు జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..