ఇస్రో సెంటిమెంట్, అంతరిక్ష ప్రయోగానికి ముందు అమ్మవారి దర్శనం చేయాల్సిందే.. ఇంతకీ ఆ ఆలయ ప్రత్యేకత ఏంటంటే..
జులై 14వ తేదీ కోసం యావత్ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.. మరికొన్ని గంటల్లో అద్భుతం సాకారం కానుంది. చంద్రయాన్ -3 ప్రయోగం కోసం దేశం మొత్తం శ్రీహరి కోటవైపు చూస్తోంది. 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే-3 సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది...
జులై 14వ తేదీ కోసం యావత్ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.. మరికొన్ని గంటల్లో అద్భుతం సాకారం కానుంది. చంద్రయాన్ -3 ప్రయోగం కోసం దేశం మొత్తం శ్రీహరి కోటవైపు చూస్తోంది. 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే-3 సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయోగాన్ని కచ్చితంగా విజయవంతం చేయాలని అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇస్రో ఏ ప్రయోగాన్ని చేపట్టినా, ముందు ఒక ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.
అదే తిరుపతి జిల్లాలోని సూళ్లూరు పేట పట్టణంలోని చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆనవాయితీ దశాబ్దాల నుంచి వస్తోంది. అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్‌తో పాటు మరికొందరు అధికారులు ఈ ఆలయాలంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. చెంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతే రాకెట్ ప్రయోగాలు చేపట్టడం ఇస్రోకు ఒక సెంటిమెంట్. ఇటీవల ఇస్రో చేపట్టి PSLC-C55 రాకెట్ ప్రయోగానికి కూడా ముందు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇస్రో తాజాగా చేపడుతోన్న చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో కూడా ఇస్రో ఛైర్మన్ చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇంతకీ శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని ఎందుకు దర్శిస్తారు.? ఈ ఆలయం చరిత్ర ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుపతి జిల్లా, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన సూళ్లూరు పేటలో ఉందీ ఆలయం. ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. పదో శతాబ్దకాలంలో పశువుల మేతకు తీసుకెళ్లిన కొందరు యువకులు పవిత్ర కళంగి అనే నదిలో ఈతకు వెళ్లారని, నీటి ప్రవాహం ధాటికి కొట్టుకుపోతూ ఒక శిలను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారంటా.. అనంతరం ఆ యువకులంతా ఆ శిలను బయటకు తీసి ఒడ్డు మీద ఉన్న ఓ చెట్టు వద్దకు చేర్చారు. యువకులు ఆ శిలను పడుకోబెట్టగా తిరిగి ఉదయం వచ్చే చూసే సరికి నిలబడి కనిపిచింది. దీంతో ఆశ్చర్యానికి గురైన గ్రామస్థులు.. ఆ మహిషాసురమర్ధనియే స్వయంభుగా వెలిసిందని భావించి.. విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లి నిర్మించారని చెబుతారు.
ఆలయానికి తలుపులు ఉండవు..
చెంగాళమ్మ ఆలయానికి తలుపులు లేకపోవడం ప్రత్యేకత. దీనికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. కొన్నేళ్ల క్రితం ఓ దొంగ గుడిలోకి వెళ్లాడంటా.. దీంతో గ్రామస్థులంతా కలిసి ఆలయానికి తలుపు ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్థుల కలలోకి వచ్చిన అమ్మవారు.. ‘నాకు భక్తులకు మధ్య ఎలాంటి అడ్డ ఉండకూడదని’ తెలపడంతో ఆ తలుపులును తీసి ఆలయ ప్రాంగణంలో ఉంచారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ తలుపుల కలప నుంచి ఒక చిన్న మొక్క మొలిచి పెద్ద వృక్షంగా మారిందని చెబుతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..