Chandrayaan 3: ప్రయోగానికి సిద్ధంగా ఉన్న చంద్రాయాన్‌-3..ముగిసిన లాంచింగ్‌ రిహార్సల్స్‌.. లాంచింగ్‌కి సర్వసన్నాహాలు..

దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్‌–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్‌ లాంచ్‌ వెహికల్‌ ఎంకే–3 రాకెట్‌ శ్రీహరి కోటలోని షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం భారత ఇస్రో సైంటిస్టులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్‌వీఎం–3 రాకెట్‌పైనే ఉంది. చంద్రయాన్‌–3 మిషన్‌లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Chandrayaan 3: ప్రయోగానికి సిద్ధంగా ఉన్న చంద్రాయాన్‌-3..ముగిసిన లాంచింగ్‌ రిహార్సల్స్‌.. లాంచింగ్‌కి సర్వసన్నాహాలు..
Chandrayaan 3
Follow us
Ch Murali

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 12, 2023 | 1:11 PM

ప్రపంచం దృష్టంతా ఇప్పుడు భారత్‌ వైపే. చంద్రుడి పై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు చంద్రయాన్ 3 ని ప్రయోగిస్తోంది భారత్‌. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్‌-3 లాంఛింగ్‌కి సిద్ధంగా ఉంది. జాబిల్లిపైకి దూసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్‌-3 అందుకు సంబంధించిన రిహార్సల్స్‌ పూర్తిచేసుకొంది. ఈనెల 14న మధ్యాహ్నం 2:35 నిముషాలకు శ్రీహరి కోట నుంచి చంద్రయాన్‌-3 ని ప్రయోగిస్తారు. లాంచింగ్‌లో కీలక ప్రక్రియ ముగిసింది. చంద్రయాన్‌-3 లాంచింగ్‌ రిహార్సల్స్‌ పూర్తయ్యాయి. లాంచ్‌ ప్యాడ్‌కు వాహక నౌకను అమర్చారు శాస్త్రవేత్తలు. 24 గంటలపాటు నిర్వహించిన రిహార్సల్స్‌ విజయవంతం అయ్యాయి. ఇక మరో మూడు రోజుల్లో గగన వీధుల్లోకి దూసుకెళుతుంది చంద్రాయన్‌-3.

అప్పుడు… చంద్రయాన్‌-2 ప్రయోగం కోట్లాదిమంది ఆశలపై నీళ్ళు చల్లింది. ఎన్నో ఆశలుపెట్టుకున్న శాస్త్రవేత్తల ఆకాంక్షలు ఆవిరయ్యాయి. అందుకే చంద్రయాన్‌ -3ని ఫెయిల్యూర్‌ బెస్ట్‌ అప్రోచ్‌తో అభివృద్ధి చేశారు. ఒక్కసారి అంతరిక్షంలోకి రాకెట్ దూసుకెళ్లాక.. ఏదైనా వ్యవస్థ విఫలమైతే.. దానంతట అదే సరిచేసుకుని మళ్లీ పనిచేసేలా దీన్ని డిజైన్ చేసినట్టు చెప్పారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.

రూ. 615కోట్ల ఖర్చుతో మిషన్ చంద్రయాన్‌-3ని అభివృద్ధి చేశారు. 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం దీని లక్ష్యం. చంద్రుడి దక్షిణ ధ్రువంలో రోవర్ ల్యాండ్‌ అవుతుంది. అంతా సవ్యంగా జరిగితే చంద్రయాన్ 3 దాదాపు 48 రోజులు ప్రయాణించి ఆగస్టు చివరివారంలో…అంటే ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. గత కాలపు వైఫల్యాలను సరిచేసుకుని…సరికొత్తగా రూపుదిద్దుకున్న చంద్రాయన్‌ భారతీయుల కలలకు రెక్కలు తొడుగుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. భారత్ కీర్తి పతాక ప్రపంచ చిత్రపటంలో మరోసారి రెపరెపలాడటం ఖాయం.

చంద్రయాన్ 3 ప్రయోగం..

వచ్చే వారం జూలై 14న అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించనున్నారు. చంద్రయాన్ సిరీస్‌లో ఇది మూడో విడత. చంద్రుని ఉపరితలంపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇది భారతదేశం రెండవ ప్రయత్నం. ఇప్పటి వరకు, కేవలం మూడు దేశాలు మాత్రమే గాలిలేని చంద్ర ప్రపంచంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేశాయి.

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ‘ప్రిజం’ ప్రయోగం

చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందు, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)లో ఒక ప్రత్యేకమైన ప్రయోగం జరగనుంది. ‘ప్రిజం: ది అన్సెస్ట్రల్ అబోడ్ ఆఫ్ రెయిన్‌బో’ పేరుతో ఈ పుస్తకాన్ని జూలై 13న విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం సైన్స్ కథనాల సమాహారం మరియు అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత-రచయిత వినోద్ మంకర రచించారు. భారతదేశం యొక్క చారిత్రాత్మక మార్స్ ఆర్బిటర్ మిషన్ ‘మంగళయాన్’పై సైన్స్-సంస్కృత డాక్యుమెంటరీ అయిన ‘యానం’ చిత్రంతో అతను తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం