TDP: ప్రజాగళం పేరుతో టీడీపీ ఎన్నికల ప్రచారం.. పలమనేరులో చంద్రబాబు రోడ్ షో..
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరులో రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హై వోల్టేజ్ ను తపిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరులో రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హై వోల్టేజ్ ను తపిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ఇదే క్రమంలో చంద్రబాబు కూడా ప్రజా గళం అంటూ ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఇందులో భాగంగా ముందు తన సొంత నియోజకవర్గం చిత్తూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలమనేరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు తమ కూటమికి ఓటు వేయాలని విజ్ఙప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బాదుడే బాదుడు అన్నట్టుగా జగన్ పాలన ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పది రూపాయలు ఇచ్చి వంద దోచుకుంటున్నారని ఆరోపించారు. దోచుకునే పార్టీ కావాలో.. సంపద సృష్టిచేవాళ్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
ఐదేళ్లుగా పరదాల చాటున తిరిగిన సీఎం జగన్ సిద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్డీయే టార్గెట్ 400కి పైగా సీట్లు అని తెలిపారు చంద్రబాబు. ఏపీలో 160కి పైగా ఎమ్మెల్యేలు, 24కి పైగా ఎంపీల గెలుపే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వమే వస్తుందని బాబు జోస్యం చెప్పారు. కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని ఆత్మవిశ్వాసాన్ని చాటారు. వైనాట్ కుప్పం కాదు వైనాట్ పులివెందుల అని జగన్ కు చురకలు విసిరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఏపీలో ఎన్డీయే కూటమి గెలవబోతున్నట్లు సర్వేలు చెప్తున్నాయన్నారు. 22 నుంచి 23 ఎంపీలు గెలుస్తామని సర్వేల్లో వార్తలు వస్తున్నాయన్నారు. 25 ఎంపీలు గెలవాలనేదే తమ ప్రయత్నం అన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…