Nellore Cow Breed: అంతర్జాతీయ మార్కెట్లో ఆంధ్రా ఆవు సత్తా.. ఏకంగా రూ.40 కోట్లు ధర పలికిన నెల్లూరు జాతి ఆవు
ప్రపంచ పశువుల వేలం పాటలో ఆంధ్రా ఆవు రికార్డు సృష్టించింది. ఏకంగా రూ.40 కోట్లకు ఆవు ధర పలికింది. నెల్లూర్‌కు చెందిన వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవీస్ బ్రీడ్ ఆవు అత్యధిక ధర పలికింది. ఇది ఇప్పటి వరకు అంతర్జాతీయ పశువులు మార్కెట్లో విక్రయించిన అత్యంత ఖరీదైన ఆవుగా చరిత్ర సృష్టించింది. బ్రెలిల్‌లో నిర్వహించిన పశువుల వేలంలో 4.8 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.40 కోట్లు)కు నెల్లూరు ఆవు అమ్ముడుపోయింది..
ప్రపంచ పశువుల వేలం పాటలో ఆంధ్రా ఆవు రికార్డు సృష్టించింది. ఏకంగా రూ.40 కోట్లకు ఆవు ధర పలికింది. నెల్లూర్‌కు చెందిన వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవీస్ బ్రీడ్ ఆవు అత్యధిక ధర పలికింది. ఇది ఇప్పటి వరకు అంతర్జాతీయ పశువులు మార్కెట్లో విక్రయించిన అత్యంత ఖరీదైన ఆవుగా చరిత్ర సృష్టించింది. బ్రెలిల్‌లో నిర్వహించిన పశువుల వేలంలో 4.8 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.40 కోట్లు)కు నెల్లూరు ఆవు అమ్ముడుపోయింది. ఈ జాతి ఆవులోని జన్యు లక్షణాల కారణంగా అది రికార్డు ధర పలికినట్లు తెలుస్తోంది. నెల్లూరు జాతి ఆవు శరీరమంతా తెల్లటి వెంట్రుకలు, భుజాలపై విలక్షణమైన మూపురం కలిగి ఉంటుంది. ఇది బ్రెజిల్‌లోని అత్యంత పేరుగాంచిన పశువుల జాతుల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పేరు కలిగిన ఈ జాతి పశువులను శాస్త్రీయంగా బోస్ ఇండికస్‌గా పిలుస్తారు. ఇవి ఒంగోలు జాతి పశువుల సంతతికి చెందినవి.
1868లో బ్రెజిల్‌కు మొదటి సారిగా జంట ఒంగోలు పశువులను తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఈ జాతి పశువుల విస్తరణ ప్రారంభమైంది. తదుపరి మరిన్ని ఆవులను దిగుమతి చేసుకోవడంతో బ్రెజిల్‌లో ఈ జాతి పశువుల సంఖ్య మరింతగా పెరిగింది. నెల్లూరు జాతి ఆవులు అత్యంత వేడి ఉష్ణోగ్రతలలో కూడా వృద్ధి చెందగల సామర్థ్యం, సమర్థవంతమైన జీవక్రియ, పరాన్నజీవి ఇన్‌ఫెక్షన్‌లను తట్టుకుని నిలబడతాయి. దీంతో బ్రెజల్ పశువుల పెంపకందారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వయాటినా-19 FIV మారా ఇమోవీస్ బ్రీడ్‌లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. జన్యుపరమైన ప్రయోజనాలను పెంపొందించడానికి ఈ బ్రీడ్ ఆవులను ప్రత్యేకంగా ఎంపిక చేసి పెంచుతున్నారు. నెల్లూరు ఆవుల జన్యు పదార్ధం, పిండాలు, వీర్యం వంటి వాటిని సేకరించి వాటి సంతానాన్ని మరింతగా ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. అందుకే నెల్లూరు జాతి ఆవుకు వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది.
She is the world’s most expensive cow and was auctioned in Arandú, Brazil for around $4.8 million. Her breed – Nellore cattle that originated from Ongole Cattle originally brought to Brazil from India. They are named after the district of Nellore in Andhra Pradesh, India. pic.twitter.com/BjfvAucI00
— Kaveri 🇮🇳 (@ikaveri) March 25, 2024
బ్రెజిల్‌లోని సావో పాలోలోని అరండూలో జరిగిన వేలంలో నాలుగున్నార సంవత్సరాల వయస్సు గల ఆవు 6.99 మిలియన్ రియల్‌లకు విక్రయింయించారు. ఇది 1.44 మిలియన్ అమెరికా డాలర్లకు సమానం. నెల్లూరు జాతీ ఆవులకు అంతర్జాతీయ పశువుల మార్కెట్‌లో విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఇది ఈ జాతి విలువను నొక్కి చెబుతుంది. నెల్లూరు ఆవులు ఇప్పటికే బ్రెజిల్ ఆవు జనాభాలో 80 శాతం ఉన్నాయి. తక్కువ మేతతో వృద్ధి చెందగల సామర్థ్యం, పెంపకం సౌలభ్యంతోపాటు బ్రెజిల్‌లోని వైవిధ్యంగా ఉండే ఎలాంటి వాతావరణంలోనైనా నిలదొక్కుకోగల సామర్థం వీటికి ఉండటంతో పశువుల పెంపకందారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన పశువుల పెంపకంలో జన్యుశాస్త్రం ప్రాముఖ్యత నొక్కి చెబుతుంది. భవిష్యత్తులో నెల్లూరు జాతి పశువుల్లో మరింత నాణ్యమైన ఆవుల పురోగతి సంభావ్యతను సూచిస్తుంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.