Andhra Pradesh: ఒక పార్టీలో ఉన్న నేతకి మరో పార్టీ టికెట్ ఆఫర్.. కలకలం సృష్టిస్తున్న సర్వే..!

ఒక పార్టీలో ఉన్న నేతకి మరో పార్టీ టికెట్ ఇచ్చేందుకు బహిరంగంగానే సర్వే చేస్తోంది. ఆ నేత సొంత పార్టీతో పాటు మరో పార్టీలో టికెట్ తెచ్చుకునేందుకు చేస్తున్న బహిరంగ ప్రయత్నాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

Andhra Pradesh: ఒక పార్టీలో ఉన్న నేతకి మరో పార్టీ టికెట్ ఆఫర్.. కలకలం సృష్టిస్తున్న సర్వే..!
Pardhasaradhi
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Mar 27, 2024 | 2:26 PM

ఒక పార్టీలో ఉన్న నేతకి మరో పార్టీ టికెట్ ఇచ్చేందుకు బహిరంగంగానే సర్వే చేస్తోంది. ఆ నేత సొంత పార్టీతో పాటు మరో పార్టీలో టికెట్ తెచ్చుకునేందుకు చేస్తున్న బహిరంగ ప్రయత్నాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

పార్థసారథి. గత ఎన్నికలలో కర్నూలు పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేశారు. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పొత్తు లేకుండా ఉంటే కర్నూలు నుంచి ఈసారి కూడా పోటీ చేసేవారు. పొత్తులో భాగంగా కర్నూలు పార్లమెంటును బీజేపీకి కేటాయించేందుకు శతవిధాల విఫలయట్నం చేశారు. దానికి బదులుగా ఆదోని లేదా ఆలూరు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే రెండు నియోజకవర్గాల్లో ఏదోక స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్థసారథి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా ఖరార్ అయింది. అట్ ది సేమ్ టైం.. తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీలో ఉన్న పార్థసారధికి అనంతపురం పార్లమెంట్ సీటు ఇచ్చేందుకు ఐవీఆర్ఎస్ సర్వే చేయడం సీమ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సభ్యత్వం లేకుండా, పక్క పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేతకు టికెట్ ఇచ్చేందుకు బహిరంగంగా సర్వే చేయడం అటు టీడీపీ ఇటు బీజేపీ కార్యకర్తల్లో హాట్ టాపిక్ అయింది.

పార్థసారథి అనంతపురం నేటివ్. కర్నూలులో స్థిరపడ్డారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే..బీజేపీ లేదా టీడీపీ.. ఏదో ఒక స్థానం నుంచి ఏదో ఒక పార్టీ నుంచి కచ్చితంగా పోటీ చేయాలనేది పార్థసారథి ఉద్దేశంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. మూడు కోట్లు ఇస్తే ఆదోని బదులు ఆలూరు అసెంబ్లీ అడుగుతామని బీజేపీ నేతలు ఆ పార్టీ అధినేత కోసం ఆదోని టీడీపీ నేతలను డిమాండ్ చేసిన ఆడియో వైరల్ అవుతున్న సందర్భంలో పార్థసారధి విషయం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరకుండానే టికెట్ విషయంపై ఐవిఆర్ఎస్ సర్వే చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని రెండు పార్టీల నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

ఇదిలావుంటే అనంతపురం ఎంపీ టికెట్ టీడీపీ నేతలు ఎందరో ఆశిస్తున్నారు వారందరిని పక్కనపెట్టి పార్థసారధి కోసం సర్వే చేయడం అది కూడా బహిరంగంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారట. మొత్తం మీద బీజేపీకి చెందిన పార్థసారథి విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పార్థసారథి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అసలు టికెట్ వస్తుందా రాదా అనేది తేలనుంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…