Andhra Pradesh: మాజీ మహిళా కౌన్సిలర్ హత్య కేసులో రౌడీ షీటర్‌కు యావజ్జీవం..!
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ విజయా రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారైంది. నేరం రుజువు కావడంతో రౌడీ షీటర్ కోలా హేమంత్ కుమార్ సహా ఇద్దరికీ యావజ్జీవ ఖైదు.. జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది న్యాయస్థానం.
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ విజయా రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారైంది. నేరం రుజువు కావడంతో రౌడీ షీటర్ కోలా హేమంత్ కుమార్ సహా ఇద్దరికీ యావజ్జీవ ఖైదు.. జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది న్యాయస్థానం. 2019 ఫిబ్రవరి 25న అక్కయ్యపాలెంలో తన ఫ్లాట్ లోనే మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి దారుణ హత్య జరిగింది. రాధిక దేవితో కలిసి విజయారెడ్డిని హత్య చేశాడు కోలా హేమంత్ కుమార్. ఎంపీ ఎంవివి కుటుంబం కిడ్నాప్ కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు రౌడీ షీటర్ హేమంత్ కుమార్.
పోలీసుల ప్రకటించిన వివరాల ప్రకారం..
అక్కయ్యపాలెం వద్ద పద్మ భాస్కర ప్రకాష్ రెసిడెన్సీ, ప్లాట్ నెంబరు 502లో మాజీ కౌన్సిలర్ విజయా రెడ్డి భర్తతో కలిసి నివాసముండేవారు. హేమంత్ కుమార్, రాధిక దేవి ఇద్దరు కలిసి విజయా రెడ్డి ఫ్లాట్ తీసుకుంటామని విజయారెడ్డి కుటుంబానికి దగ్గరయ్యారు. 2019 ఫిబ్రవరి 25న విజయా రెడ్డి భర్త ఇంటికి వెళ్లి చూసే సరికి తాళం వేసి ఉంది. ఆమెకు ఫోన్ చేస్తే.. ఫోన్ పనిచేయలేదు. దీంతో కోలా హేమంత్ కు ఫోన్ చేశారు విజయారెడ్డి భర్త. ఆమెను అక్కయ్యపాలెం హైవే వద్ద తన కారులో దింపి వెళ్ళిపోయాను అని బదులిచ్చాడు హేమంత్ కుమార్. ఎంత సేపటికీ విజయారెడ్డి ఇంటికి రాకపోవడంతో బంధువులను సంప్రదించాడు భర్త. ఎవరి వద్దకు రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చి, ఇంటి తాళం పగలగొట్టి లోపలకు వెళ్ళాడు. బాత్రూంలో విజయారెడ్డి.. తీవ్ర రక్తస్రావంతో గాయలతో మరణించినట్లు గుర్తించాడు. ఆమె బంగారు ఆభరణాలు, కారు కనిపించడం లేదని గుర్తించి నాల్గవ పట్టణ పోలీసులను సంప్రదించారు.
రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారలతో నిందితులను పట్టుకున్నారు. హేమంత్ కుమార్,రాధిక పథకం ప్రకారమే కిరాతకంగా విజయా రెడ్డి ని హత్య చేసినట్టు గుర్తించి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి నగదు, బంగారు ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, సి సి టివి ఫుటేజ్, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి ఛార్జిషీట్ ఫైల్ చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. నేరం రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ. 12వేల జరిమానా విధించింది కోర్టు. రౌడీ కోలా హేమంత్ కుమార్ కిడ్నాప్ కేసులు, దోపిడీ సహా.. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసులోను నిండితుడుగా ఉన్నాడు.
విజయారెడ్డి హత్య కేసును ప్రాధాన్యత గల కేసుగా పరిగణించి డీసీపీ క్రైమ్స్ వెంకట రత్నం ట్రైల్ ను పర్యవేక్షించారు. కేసులో కన్విక్షన్ పడేలా ప్రతిభ కనబరిచిన పీపీ శ్రీనివాస రావు, కేసు ట్రయల్ జరగడంలో పూరోగతి చూపించిన పోలీసు అధికారులను పోలీసు కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…