AP CM Jagan: జగన్ బస్సు యాత్ర షురూ.. ‘‘మేమంతా సిద్ధం’’ కు జనం జేజేలు
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మేమంతా సిద్ధం పేరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇవాళ ఇడుపులపాయలోని YS ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయల్దేరారు.

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మేమంతా సిద్ధం పేరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇవాళ ఇడుపులపాయలోని YS ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయల్దేరారు. ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయనపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు బస్సు యాత్ర సాగుతుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభకు సీఎం జగన్ హాజరవుతారు. బస్సుయాత్ర ప్రారంభించిన జగన్‌కు, దారిపొడవునా జనం స్వాగతం పలికారు. మధ్యలో జగన్ బస్సు దిగి, ప్రజలను పలకరించారు. వారి వినతులను స్వీకరించారు.
సీఎం జగన్ బస్సు యాత్ర విజువల్స్..
బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించిన సీఎం జగన్.. ఆయన సమాధికి నివాళులు అర్పించారు. అక్కడ జరిగిన ప్రార్థనాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దలు, అర్చకులు సీఎం జగన్‌కు అశీర్వాదం అందజేశారు.
మేమంతా సిద్దం బస్సు యాత్ర..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



