AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలూ బీఅలెర్ట్.. రాయలసీమలో హడలెత్తిస్తున్న చైన్‌ స్నాచర్లు.. ఒకేరోజు నాలుగు చోరీలు..

తెలుగు రాష్ట్రాల్లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకీ బరితెగిస్తున్నారు. మహిళల మెడల్లో మంగళసూత్రాలను టార్గెట్‌ చేసి నిర్దాక్షిణ్యంగా తెంపుకెళ్తున్నారు. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో ఒక్కరోజే నాలుగైదు చోట్ల గొలుసు దొంగతనాలు జరగడం మహిళలను కంగారు పెడుతోంది. రాయలసీమ జిల్లాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగలు రెచ్చిపోయారు.

మహిళలూ బీఅలెర్ట్.. రాయలసీమలో హడలెత్తిస్తున్న చైన్‌ స్నాచర్లు.. ఒకేరోజు నాలుగు చోరీలు..
Chain Snatching
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2023 | 9:08 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకీ బరితెగిస్తున్నారు. మహిళల మెడల్లో మంగళసూత్రాలను టార్గెట్‌ చేసి నిర్దాక్షిణ్యంగా తెంపుకెళ్తున్నారు. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో ఒక్కరోజే నాలుగైదు చోట్ల గొలుసు దొంగతనాలు జరగడం మహిళలను కంగారు పెడుతోంది. రాయలసీమ జిల్లాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగలు రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని 5వ రోడ్‌లో ఇంటి ముందు ఊడుస్తున్న మహిళ మెడలోని చైన్‌ను దొంగలు లాక్కెళ్లడం కలకలం రేపింది. అడ్రస్ అడుగుతున్నట్లు నటించి.. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే.. మారెక్క అనే మహిళ మెడలోని రెండు తులాల గోల్డ్‌ చైన్ లాక్కెళ్లారు దుండగులు. పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు.. బంగారం గొలుసుతో ఉడాయించారు. చైన్‌ స్నాచింగ్‌ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

అనంతపురం జిల్లా యల్లనూరు మండల కేంద్రంలోనూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు దొంగలు. నారాయణమ్మ అనే మహిళ తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లగా.. స్కూటీ వచ్చిన ఓ దొంగ.. మెడలోని 3తులాల బంగారం గొలుసును తెంపుకుని వెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి.. చుట్టుపక్కల గ్రామాలను అలర్ట్‌ చేశారు.

ఇదిలావుంటే.. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఒకే రోజు రెండు చోట్ల చైన్స్ స్నాచింగ్ జరిగింది. డోన్ పట్టణంలోని కేవీఎస్ కాలనీలో ఇంటి బయట ఉన్న పద్మావతి అనే మహిళ మెడలోని ఆరు తులాల గోల్డ్‌ చైన్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కొని పారిపోయారు. ఆ ఘటన జరిగిన గంటన్నరకే సమీపంలోని బేతంచర్లలో అంగన్వాడీ టీచర్ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగులు. అయితే.. రెండు చోట్ల చోరీలకు పాల్పడింది ఒక్కటే గ్యాంగా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు కావడంతో.. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మొత్తంగా.. రాయలసీమ జిల్లాల్లో ఒకే రోజు చైన్‌ స్నాచర్లు ప్రజల్ని హడలెత్తించారు. వరుస గొలుసు దొంగతనాలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టపగలు జరిగిన సంఘటనలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే.. చైన్‌ స్నానింగ్‌ దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కావడంతో దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..