Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు.. ఆరోజు విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది

Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు.. ఆరోజు విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు
Ys Bhaskar Reddy
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2023 | 11:23 AM

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈమేరకు సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ మంగళవారం సాయంత్రం పులివెందులలోని భాస్కర్‌ రెడ్డి ఇంట్లో నోటీసులు అందజేసింది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో ఈనెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది సీబీఐ. కాగా ఇదే హత్య కేసులో గత నెల 18న తొలి సారి భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ముందస్తు కార్యక్రమాలతో ముందస్తు కార్యక్రమాలతో గత నెల 23న విచారణకు రాలేననన్నారు. భాస్కర్ రెడ్డి. ఈ నేపథ్యంలో మరో సారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో భాస్కర్‌ రెడ్డి కుమారుడు, ఎంపీ అవినాష్ రెడ్డిలను ఇప్పటికే రెండుసార్లు విచారణకు పిలిచింది సీబీఐ. అదేవిధంగా ఇటీవలే సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి పీఏ నవీన్‌లను కడప సెంట్రల్‌ జైల్‌లో విచారించారు. ఈక్రమంలో అవినాష్, ఇతరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా భాస్కర్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని కుట్రదారుడిగా సీబీఐ తేల్చింది. వివేకా హత్య గురించి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు ముందే తెలుసునని సీబీఐ పిటిషన్‌లో కోర్టుకు తెలిపింది. ఈక్రమంలో భాస్కర్ రెడ్డిని విచారించేందుకు నోటీసులు జారీ చేసింది. ఇక 2019 మార్చి 15న ఆయన ఇంట్లోని బాత్రూమ్‌లోనే వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపారు దుండగులు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.  అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో రచ్చ రచ్చ అయ్యింది. అయితే వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె వైఎస్ సునీత అభ్యర్థన మేరకు కేసును సీబీఐకు అప్పగించింది హైకోర్టు. అప్పటి నుంచి కేసు దర్యాప్తులో పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డిలను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..