Kondapalli Toys: జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధంగా మన ‘కొండపల్లి బొమ్మ’.. మీరు చేయాల్సింది ఇదొక్కటే..
చరిత్ర కలిగిన హస్తకళ కొండపల్లి బొమ్మల తయారీ. ప్రపంచ వ్యాప్తంగా కొండపల్లి బొమ్మలకు పేరుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ప్రాంతంలో కొండపల్లి బొమ్మల తయారీ జరుగుతుంది. ఇక్కడ 600 కుటుంబాలు నిత్యం బొమ్మల తయారీ మీద ఆధారపడి జీవిస్తున్నాయి.
చరిత్ర కలిగిన హస్తకళ కొండపల్లి బొమ్మల తయారీ. ప్రపంచ వ్యాప్తంగా కొండపల్లి బొమ్మలకు పేరుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ప్రాంతంలో కొండపల్లి బొమ్మల తయారీ జరుగుతుంది. ఇక్కడ 600 కుటుంబాలు నిత్యం బొమ్మల తయారీ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఏళ్ల తరబడి నుండి తమ చేతికి బొమ్మల తయారీ ద్వారా పని చెబుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. కొండపల్లి బొమ్మల తయారూ వారి జీవన విధానాన్ని ఆ ప్రాంతానికే పరిమితం చెయ్యలేదు, దేశవ్యాప్తంగా, వివిధ దేశాలలోనూ ప్రాబల్యాన్ని చాటుతుంది.
ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి కొండపల్లి బొమ్మలు సత్తా చాటడానికి సిద్దమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందించే వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అవార్డుకు ఎంపిక చేసారు. అంతే కాదు రేపటి నుండి ఈ ఓటింగ్ కూడా జరగబోతోంది. కొండపల్లి బొమ్మలకు అధిక శాతం ఓటింగ్ లభిస్తే అవార్డు సొంతమయ్యే అవకాశంతో పాటు కొండపల్లి బొమ్మల ప్రాముఖ్యత మరోసారి దేశప్రజలకు తెలుస్తుంది. తద్వారా కొండపల్లి బొమ్మలకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. బొమ్మల తయారీపై ఆదారపడి జీవిస్తున్న కుటుంబాలకు మేలు కలుగుతుంది.
అందుకే ఎన్టీఆర్ జిల్లా అధికారులు కొండపల్లి బొమ్మలకు అవార్డు దక్కేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది నుండి కొండపల్లి బొమ్మల తయారీకి అందించిన ప్రోత్సాహకాలు, విక్రయాలు, శిక్షణ తరగతులు, ప్రదర్శనలు, బొమ్మల తయారీకి వాడే పరికరాలు, కలప, రంగులు ఇలా ప్రతి అంశాన్ని డేటా రూపంలో ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. జిల్లా అధికారులు కొండపల్లి బొమ్మల తయారీని తరచూ సందర్శించడం, కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. నాలుగు వందల ఏళ్ల సంస్కృతిని భావితరాలకు అందించే విధంగా కొండపల్లి బొమ్మలకు వన్నె తెచ్చేలా అవార్డు దక్కేలా కృషి చేయాలని ఆదేశాలిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్‌లో పాల్గొని కొండపల్లి బొమ్మలకు జాతీయ అవార్డు దక్కేలా కృషి చేయాలని ఎన్టీయార్ జిల్లా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయూష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కళలను ప్రోత్సహించేందుకు జరుగుతున్న వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రోడెక్ట్ 2023 అవార్డు ఓటింగ్‌లో కొండపల్లి బొమ్మలకు ఓటు వేయాలని సూచించారు. కొండపల్లి బొమ్మలకు జాతీయ అవార్డు సాధించడం ద్వారా కొండపల్లి బొమ్మలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని అధికారులు కృషి చేస్తున్నారు. ఈ ఓటింగ్ విజయవంతమైతే ఎన్టీయార్ జిల్లాకు మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ ఢిల్లీరావు సూచించడంతో ఎన్టీఆర్ జిల్లా అధికారులు కొండపల్లి బొమ్మలకు అవార్డు దక్కేందుకు తమ కృషి అందించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..