Andhra Pradesh: అయ్యో పాపం.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన రెండేళ్ల బాలుడు.. తీవ్ర విషాదం

ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బాధిత తల్లిదండ్రులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. 

Andhra Pradesh: అయ్యో పాపం.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన రెండేళ్ల బాలుడు.. తీవ్ర విషాదం
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా కండరాల పనితీరుకు అంతరాయం కలిగి.. మూర్ఛ, బలహీనతకు కారణమవుతుంది. అదనపు నీటిని ప్రాసెస్ చేయడంలో శరీరం అధిక శ్రమకు గురౌతుంది. ఫలితంగా అలసట, మానసిక గందరగోళానికి దారితీస్తుంది.
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 10, 2024 | 1:53 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింగ్ అనుకుని రెండేళ్ల బాలుడు పెట్రోల్ తాగిన సంఘటన ఆ ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా, అమ్ము దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరిముల్లా చికెన్ దుకాణం నడిపిస్తుండగా..అమ్ములు చేపల దుకాణంలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ హాయిగా జీవిస్తున్నారు.

అయితే, ఈ నెల 7వ తేదీ సాయంత్రం అమ్ము ఇరుగాళమ్మ ఆలయం దగ్గర పనిచేస్తుండగా…ఆమె కొడుకు కాలేషా తన వద్దే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఒక బాటిల్లో ఉన్న పెట్రోల్ చూసిన బాలుడు.. అది కూల్ డ్రింక్ అనుకుని తాగాడు.. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బాధిత తల్లిదండ్రులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!