Janasena: “పార్టీ మారితే చెయ్యి నరకాలన్నాడు..” పోతిన మహేష్‌పై కిరణ్ రాయల్ ఫైర్
జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన పోతిన మహేష్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఈ క్రమంలో పవన్‌పై తీవ్ర కామెంట్స్ చేశారు. అయితే మహేష్‌కు అంతేస్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు జనసేన నేతలు. ఆ డీటేల్స్...
పోతిన మహేష్‌పై జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. పార్టీ మారితే చెయ్యి నరకాలంటూ పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఒక వీడియో ప్రదర్శించారు కిరణ్ రాయల్. తమ కార్యకర్తలు కొబ్బరిబొండాల కత్తిని కొరియర్ చేస్తారని చెప్పారాయన. స్వార్థ ప్రయోజనాల కోసమే పోతిన మహేష్ YCPలో చేరారని కిరణ్ రాయల్ ఆరోపించారు.
మరోవైపు వైసీపీలో చేరిన పోతిన మహేష్ జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన రాజకీయ పార్టీ కాదు.. అదొక నటుల సంఘం అంటూ అభివర్ణించారాయన. నటుడు ఎప్పుడూ నాయకుడు కాలేడని పోతిన మహేష్ పవన్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని పోతిన మండిపడ్డారు. ఓ నటుడి కోసం పనిచేసి మోసపోయానన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 10, 2024 01:44 PM
వైరల్ వీడియోలు
Latest Videos