AP Elections: చంద్రబాబు నాకు తల్లి, తండ్రితో సమానం: సుజనా చౌదరి

AP Elections: చంద్రబాబు నాకు తల్లి, తండ్రితో సమానం: సుజనా చౌదరి

Ram Naramaneni

|

Updated on: Apr 10, 2024 | 11:43 AM

అరున్ జైట్లీ సలహా ఇవ్వడం వల్లే తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు సుజనా చౌదరి. చంద్రబాబు తనకు దైవంతో సమానమన్నారు. పవన్ ఆంధ్ర ప్రజల కోసం.. తన సొంత అన్న నాగబాబు టికెట్ కూడా త్యాగం చేసినట్లు తెలిపారు. విజయవాడ భవానీపురం బీజేపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మూడు పార్టీల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు సుజనా చౌదరి.

చంద్రబాబు నాయుడే తనకు రాజకీయ గురువు అంటున్నారు బీజేపీ విజయవాడ వెస్ట్ అభ్యర్థి సుజనా చౌదరి. ఆయన తనకు తల్లి, తండ్రి, దైవంతో సమానం అన్నారు. జాతీయ పార్టీలో పనిచేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని అంటున్నారు. పొత్తు కోసం పవన్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారన్న సుజనా.. ఏపీ ప్రజల కోసం త్యాగమూర్తిలా మారారన్నారు. విజయవాడ భవానీపురం బీజేపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మూడు పార్టీల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు సుజనా చౌదరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.