- Telugu News Photo Gallery Amazing Health Benefits Of Swimming Everyday For Your Health Telugu Lifestyle News
Swimming : రోజూ స్విమ్మింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే మొదలుపెడతారు..!
అవును, స్విమ్మింగ్ కూడా శరీరానికి మంచి వ్యాయామం అంటున్నారు నిపుణులు. అన్ని రకాల వ్యాయామాల కంటే కూడా ఈత కొట్టడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొంత సమయం పాటు స్విమ్మింగ్ చేయటం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని సూచిస్తున్నారు. ఈత కొట్టడం వల్ల రక్తనాళాలు మరియు గుండె బలంగా తయారవుతాయి. స్విమ్మింగ్‌తో మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Apr 10, 2024 | 1:28 PM

రెగ్యూలర్‌గా స్విమ్మింగ్ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 50 శాతం తక్కువగా ఉంటాయని నిపుణుల పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని వారు చెబుతున్నారు. అలాగే ఈత కొట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.

ఆస్థమా వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడే వారిలో స్విమ్మింగ్ వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఈత కొట్డడం వల్ల శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. దీంతో శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది.

కొందరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వాకింగ్, రన్నింగ్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేయలేరు. అలాంటి వారికి స్విమ్మింగ్‌తో మేలు చేస్తుంది. ఈత కొట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఈత కొట్టడం అనేది చక్కటి వ్యాయామం. స్విమ్మింగ్‌తో క్యాలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఈత కొట్టడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈత కొట్టడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.

శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. అలాగే, అన్ని వయసుల వారు ఈత కొట్టవచ్చు. కనుక ఏ వయసు వారికైనా ఇది చక్కటి వ్యాయామం అంటున్నారు నిపుణులు. అలాగే ఇతర వ్యాయామాలు చేయడం వల్ల దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈత కొట్టడం వల్ల అలాంటి ప్రమాదాలు తక్కువ. మరెందుకు ఆలస్యం ఈ సమ్మర్ హాలీడేస్‌లో మీ పిల్లలతో పాటు మీరు స్విమ్మింగ్ మొదలుపెట్టేయండి..




