- Telugu News Photo Gallery All you need to know about the benefits of Saindhava Lavana Telugu Lifestyle News
Rock Salt : సైంధవ లవణంతో ఉపయోగాలు తెలుసా..? తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి..!
సాధారణ ఉప్పు కంటే సైంధవ లవణం ఎంతో శ్రేష్టమైనదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో రాక్‌సాల్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉప్పును వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలు ఇందులో కలవవు. అందుకే సాధారణ ఉప్పుకు ఇది ఆరోగ్యకరమైన ప్రత్యాహ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు.
Updated on: Apr 10, 2024 | 1:01 PM

సైంధవ లవణం అంటే.. మెగ్నీషియం, సల్ఫేట్‌లతో తయారైన ఒక ఖనిజ లవణం. ఈ ఉప్పు ముదురు నీలం, ఊదారంగు, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో దొరుకుతుంది. ఈ రాక్ సాల్ట్ ఇతర ఉప్పులకంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఎలాంటి రసాయనాలు ఇందులో కలవవు.

సైంధవ లవణంలో అయోడిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్న వారు సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడాలని నిపుణులు చెబుతున్నారు.

అజీర్తి కారణంగా వాంతులు అవుతున్నప్పుడు రాక్ సాల్ట్‌కి జీలకర్ర పొడిని కలిపి తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి. జీర్ణ శక్తిని పెంచడంలో, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణాన్ని ఉపయోగించడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది.

సైంధవ లవణాన్ని వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. థైరాయిడ్ సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా సహాయపడుతుంది. మజ్జిగలో కాస్త సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీవక్రియ సాఫీగా జరుగుతుంది.

సైంధవ లవణంలో ఐరన్ ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది ఉపయోగపడుతుంది. సైంధవ లవణం నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోవడం, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి, గొంతులో మంట ఉన్నప్పుడు సైంధవ లవణం నీటిని పుక్కిలిస్తే సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.





























