AP News: అయ్యో దేవుడా.! ఇదేం కర్మరా.. బర్డ్ ఫ్లూతో మరో 4 వేలకుపైగా కోళ్లు మృతి..
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. స్థానిక గంగాలమ్మ తల్లి ఆలయ సమీపంలోని పెద్ద కాలువ వద్ద ఉన్న కోళ్ల ఫారంలో మొత్తం కోళ్లలన్నీ చనిపోవడంతో ఇప్పుడు ఆ కోళ్ల ఫారం ఖాళీ అయింది. నిన్న మొన్నటి నుంచి కూడా చనిపోయిన కోళ్లను ఫారం ఎదుటే ఎండబెట్టిన దృశ్యాలు..

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. స్థానిక గంగాలమ్మ తల్లి ఆలయ సమీపంలోని పెద్ద కాలువ వద్ద ఉన్న కోళ్ల ఫారంలో మొత్తం కోళ్లలన్నీ చనిపోవడంతో ఇప్పుడు ఆ కోళ్ల ఫారం ఖాళీ అయింది. నిన్న మొన్నటి నుంచి కూడా చనిపోయిన కోళ్లను ఫారం ఎదుటే ఎండబెట్టిన దృశ్యాలు.. కోళ్ల ఫారం ఎదుట కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన కోళ్లను నీళ్లు లేని ఎండిపోయిన కాలువలో గొయ్యి తీసి పూడ్చేందుకు సన్నద్ధమయ్యారు కోళ్ల ఫారం నిర్వాహకులు. ఇప్పటికే నాలుగు వేలుకు పైగా మృత్యువాత పడిన కోళ్లను గొయ్యిలో వేసినట్లు కోళ్ల ఫారం యాజమాని వెల్లడించారు. మరి కొన్నింటిని నిన్నటి నుంచి ఎండలో ఉంచారు. చనిపోయిన కోళ్లు వద్ద ఈగలుతో.. దుర్గంధం వెదజళుతోందని.. కోళ్లు ఫారం ఉన్న ప్రాంతం చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందుతున్నారు.
కోళ్లు ఫారంలోని చనిపోయిన కోళ్లను అక్కడ ఉన్న చిన్న పిల్లలతో కనీసం మాస్క్ కూడా లేకుండా పాడేయిస్తున్నారు కోళ్ల ఫారం నిర్వాహకులు. ఇప్పటికే ఏలూరు జిల్లా ఒక వ్యక్తికి బర్డ్స్ ఫ్లూ వచ్చిందని భయంతో ఉంటే.. మరోపక్క కనీసం మాస్క్ లేకుండా చిన్న పిల్లలతో కోళ్లను ఎత్తిస్తున్నారు కోళ్ల ఫారం నిర్వాహకులు. బర్డ్స్ ఫ్లూ భయంతో కోళ్ల ఫారం సమీపంలో ఉన్న రైతులు చనిపోయిన కోళ్లు నుంచి వెదజళుతున్న దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇది ఇలా ఉండగా గోకవరం మండల కేంద్రంలో ఉన్న అన్ని కోళ్ల ఫారంలు పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అధికారులు పర్యవేక్షణలో కోళ్ల ఫారంపై దృష్టి చేపట్టి బర్డ్ ఫ్లూకి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి