Andhra Pradesh: బిగ్ సస్పెన్స్.. ఏపీలో 8 పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కన్ను.. పొత్తు పొడుస్తుందా?
Big News Big Debate: ఏపీలో పొత్తులపై బీజేపీ .. బిగ్ సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది. కూటమిలో చేరికపై ఆ పార్టీ అధికాయకత్వం ఆలోచన ఏమిటనేది అంతుచిక్కడం లేదు. ఇలాంటివేళ సీఎం సీటుకు సంబంధించి.. ఏపీ కమలంనేతలు చేసిన వ్యాఖ్యలు.. సంచలనం రేపుతున్నాయి. అటు, టీడీపీ, జనసేన వర్గాలు మౌనం పాటిస్తుండటం కూడా... చర్చనీయాంశమవుతోంది.
Big News Big Debate: ఏపీలో పొత్తులపై బీజేపీ .. బిగ్ సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది. కూటమిలో చేరికపై ఆ పార్టీ అధికాయకత్వం ఆలోచన ఏమిటనేది అంతుచిక్కడం లేదు. ఇలాంటివేళ సీఎం సీటుకు సంబంధించి.. ఏపీ కమలంనేతలు చేసిన వ్యాఖ్యలు.. సంచలనం రేపుతున్నాయి. అటు, టీడీపీ, జనసేన వర్గాలు మౌనం పాటిస్తుండటం కూడా… చర్చనీయాంశమవుతోంది.
అమిత్‌షాతో చంద్రబాబు భేటీజరిగి రోజులు గడుస్తున్నా… టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరికపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఇన్ని సీట్లు, అన్ని సీట్లు అంటూ ప్రచారమే తప్ప… అటు కూటమి పార్టీల నుంచి గానీ, ఇటు బీజేపీ నుంచి గానీ అధికారికంగా ప్రకటన మాత్రం రావడం లేదు. దీంతో, పొత్తులపై బీజేపీ ఆలోచన ఏమిటన్నది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… ఏపీ కమలం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పొత్తులు అడుక్కునే స్థితిలో బీజేపీ లేదంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. పొత్తుల సంగతి హైకమాండ్ చూసుకుంటుందంటూనే .. కాషాయనేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీలో గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక లిస్టు రెడీచేసి హైకమాండ్‌కు పంపినట్టు తెలుస్తోంది. వాటిని అధినాయకత్వం పరిశీలించి చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే పొత్తులపై ఓ క్లారిటీ వస్తుంది. అయితే, తమ సిట్టింగులకు టిక్కెట్ల విషయంలో టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.
రాష్ట్రనాయకుల వ్యాఖ్యలతో… కూటమితో బీజేపీ జట్టుకట్టడంపై సందిగ్ధత మరింత ఎక్కువైందనే చెప్పొచ్చు. మరి, ఈ సస్పెన్స్‌కు బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పుడు,ఎలా తెరదించుతుందో? చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
