AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు ఆమోదం.. ముగ్గురు వైసీపీ అభ్యర్ధుల ఎన్నిక లాంఛనమే..!

ఏపీలో రాజ్యసభ ఎన్నిక లాంఛనం కానుంది. ఖాళీ అయిన మూడు స్థానాలకు వైసీపీ తరుఫున మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో వారిని ఎన్నికల సంఘం అమోదంతో రాజ్యసభ సభ్యులుగా అమోదించనున్నారు. ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.విజయరాజు వెల్లడించారు.

AP Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు ఆమోదం.. ముగ్గురు వైసీపీ అభ్యర్ధుల ఎన్నిక లాంఛనమే..!
Ap Rajyasabha Nominations
S Haseena
| Edited By: |

Updated on: Feb 16, 2024 | 6:29 PM

Share

ఏపీలో రాజ్యసభ ఎన్నిక లాంఛనం కానుంది. ఖాళీ అయిన మూడు స్థానాలకు వైసీపీ తరుఫున మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో వారిని ఎన్నికల సంఘం అమోదంతో రాజ్యసభ సభ్యులుగా అమోదించనున్నారు. ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.విజయరాజు వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎంపీ అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, ఆయా అభ్యర్ధుల తరుపున హాజరైన ప్రతినిధుల సమక్షంలో జరిగింది.

వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు పరిశీలించగా ముగ్గురు అభ్యర్ధు వారి నామినేషన్లతో అవసరమైన పలు డాక్యుమెంట్లన్నీ పూర్తి స్థాయిలో సక్రమంగా సమర్పించడంతో ఆ ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్లను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు వెల్లడించారు. కాగా స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా, ఆయనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడిన పత్రాన్ని సమర్పించకపోవడంతో నామినేషన్ల పరిశీలనలో ఆతని నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఆర్‌వో విజయరాజు స్పష్టం చేశారు.

రాజ్య సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉప సంహరణకు ఫిబ్రవరి 20వ తేదీ వరకూ గడువు ఉన్నందున అదే రోజున ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి విజయరాజు తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమక్షంలో స్క్రూటినీ ప్రక్రియ నిర్వహించారు. నామినేషన్లు స్క్రూటినీ ప్రక్రియ ముగియడంతో వైసీపీ గెలుపు లాంఛనమే అని భావించాలి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే అనూహ్యంగా టీడీపీ బరిలో ఉంటుందని భావించినా చివరి నిమిషంలో వెనకడుగు వేసింది. దీంతో వైసీపీ గెలుపు ఇక నల్లేరుపై నడక అయ్యింది.

ఇక తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు విముఖత చూపడంతో ఆ పార్టీ తరపున ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. మరోవైపు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలంతో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల పదవీ కాలం ముగిసింది. టీడీపీ తరఫున 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత నలుగురు పార్టీ ఫిరాయించారు. వైసీపీ నుంచి మరో నలుగురు టీడీపీలో చేరారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో టీడీపీ బలం 18కు పరిమితమైంది. పార్టీ మారిన నలుగురిపై అనర్హత వేటు పడే అవకాశముంది. మరోవైపు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు కూడా లభించే అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దాల్లో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిథ్యం కోల్పోవడం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…. 

పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!