Grandhi Srinu Vs Janasena: జనసేనానిపై, కార్యకర్తలపై మళ్ళీ సంచలన కామెంట్స్ చేసిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీను..

Surya Kala

Surya Kala |

Updated on: Sep 03, 2021 | 1:58 PM

YCP MLA Grandhi Srinu: భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన నేతలు, కార్యకర్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన నేతలు పిల్ల చేష్టలు చేస్తున్నారంటూ గ్రంథి శ్రీను..

Grandhi Srinu Vs Janasena: జనసేనానిపై, కార్యకర్తలపై మళ్ళీ సంచలన కామెంట్స్ చేసిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీను..
Grandhi Srinu
Follow us

YCP MLA Grandhi Srinu: భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన నేతలు, కార్యకర్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన నేతలు పిల్ల చేష్టలు చేస్తున్నారంటూ గ్రంథి శ్రీను వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం ప్రజలకు కనిపించలేదని.. ఇదే విషయం జనసేన కార్యకర్తలు అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేయాలంటూ.. నాయకా మళ్లీ కనుమరుగై పాయావ్.. నల్ల పూస అయ్యావ్ భీమవరం రావయ్య పవన్ కళ్యణ్ అని ఫ్లెక్సీ పెట్టుకుంటే జనాలు హర్షించేవాళ్ళని ఎమ్మెల్యే జనసేన కార్యకర్తలకు సలహా ఇచ్చారు.

జనసేన కార్యకర్తలు ఎటువంటి వారో స్వయంగా అల్లు అర్జున్, నాగబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని.. భీమవరంలో ఒక్కచోట కాదు ఎవరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన జనసేన కార్యకర్తలు విచక్షణ కోల్పోతున్నారు. ఇంకా చెప్పాలంటే జనసేన కార్యకర్తలు తాలిబన్ ల మాదిరిగా ప్రవర్తిస్తున్నారంటూ.. గ్రంథి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. తనని ఇక్కడ వారు ఏమీ చేయలేక .. పవన్ కళ్యాణ్ ను ఇక్కడ పోటీకి నిలబెట్టారు. ఇప్పుడు నన్ను అపఖ్యాతి పాలు చేసేందుకు మళ్ళీ ఇలా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తాను సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని .. మంత్రి పదవి ఇచ్చినా భీమవరం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెప్పారు.

Also Read: పనిలో విఘ్నాలు తొలగాలన్నా, సరస్వతి కటాక్షం కలగాలన్నా ఏ దేవుడిని, ఏ పువ్వులతో పూజించాలంటే  

 ప్రపంచంలోనే అత్యంత ‘అందమైన దోమ’.. ఎక్కడ.. ఏ దేశంలో ఉందంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu