Pooja with Flowers: పనిలో విఘ్నాలు తొలగాలన్నా, సరస్వతి కటాక్షం కలగాలన్నా ఏ దేవుడిని, ఏ పువ్వులతో పూజించాలంటే

Surya Kala

Surya Kala |

Updated on: Sep 03, 2021 | 1:37 PM

మన హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఫలం, పత్రం పుష్పం తోయం.. అంటే.. ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల భక్తుడు ఇచ్చేదానిని సంతోషంగా ఆరగిస్తానని కృష్ణుడు 'గీత'లో చెప్పాడు. అయితే వీటిల్లో పుష్పాలకు అత్యంత ప్రాధ్యానత ఇచ్చారు. ఆ విధంగా ఒక్కో దేవుడికి ఇష్టమైన ఒక్కో పువ్వు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 03, 2021 | 1:37 PM
స్థిరమైన వ్యక్తిత్వానికి సూచిక బంతి పువ్వు.. ఇది విఘ్నలకధిపతి వినాయకుడికి ఇష్టమైన పువ్వు. పండగలు, ఫంక్షన్లు ఏమి జరిగినా అలంకరణలో బంతిపువ్వు ఉండాలసిందే.. ఈ పువ్వుతో అలంకరణ శుభప్రదమని భావన. అంతేకాదు..  బంతిపువ్వు కారణంగా సానుకూలత పెరిగి ఆలోచనల్లో మార్పులు వస్తాయి.

1 / 4
దేవతల చెట్టు పారిజాతం.. ఈ వృక్షం క్షీరసాగర మథన సమయంలో సముద్రం నుంచి జన్మించింది. ఈ చెట్టుని శ్రీ మహావిష్ణువు స్వర్గానికి తీసుకొచ్చాడట. ఇక అందమైన రూపముతో పాటు పాటు సువాసన వెదజల్లే ఈ పారిజాతం అంటే శ్రీమహావిష్ణువుకు బహుప్రీతి అని పురాణాల కథనం. అందుకనే ఏకాదశి రోజున పారిజాతం పూలతో పూజిస్తే.. అనుగ్రహం కలుగుతుందనని అంటారు.

2 / 4
కాళీమాతకు ఎర్రమందారమంటే అత్యంత ఇష్టమట. ఎందుకంటే కాళీమాత నాలుకకి గుర్తు ఎర్రమందారమని.. ఎరుపు రంగు భయం కలిగించే ఆమె రూపానికి గుర్తుగా చెబుతారు. అందుకనే అమ్మవారి అనుగ్రహం కోసం 108 ఎర్రమందారాల దండను అమ్మవారికి సమర్పిస్తారు.

3 / 4
చదువుల తల్లి సరస్వతికి గోజిపువ్వు అంటే ఇష్టమట. ఈ పువ్వు సృజనాత్మకతకు చిహ్నం. అంతేకాదు జ్ఞానానికి, తెలివికి గుర్తుగా గోగి పువ్వు  నిలుస్తుంది. కనుక సరస్వతి కటాక్షం కోసం పూజించేవారు ఈ పువ్వులతో పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయట

4 / 4

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu