గుంటూరులో ఘోరం.. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చుకుని ఏఆర్‌ కానిస్టేబుల్‌ సూసైడ్‌!

గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్కార్ట్ విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారులోనే కూర్చుని తన వద్ద ఉన్న గన్ తో పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

గుంటూరులో ఘోరం.. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చుకుని ఏఆర్‌ కానిస్టేబుల్‌ సూసైడ్‌!
AR constable suicide in Guntur
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2024 | 6:24 PM

అమరావతి, నవంబర్‌ 22: గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశీ శ్రీనివాస్‌ అనే ఏఆర్‌ కానిస్టేబుల్‌ పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చుకున్నాడు. దీంతో అక్కడికక్కడే క్షణాల్లో కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. గుంటూరులో చుట్టుగుంటలో నివాసం ఉంటోన్న కానిస్టేబుల్ వంశీ శ్రీనివాస్‌ ఎస్కార్ట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ శుక్రవారం (నవంబర్ 22) ఎస్కార్ట్‌ కారులోనే తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్‌ బ్లాక్‌లో కాల్చుకున్నాడు. కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఉన్నతాధికారుల విచారణ ప్రారంభించారు.

ఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక కారణాలు, విధుల్లో ఒత్తిడి వంటి కోణంలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వంశీ శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.