AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: ఏపీలో నెక్స్ట్‌ సీఎం ఎవరో చెప్పేసిన చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, బడ్జెట్‌పై చర్చలో భాగంగా.. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు..

Chandrababu: ఏపీలో నెక్స్ట్‌ సీఎం ఎవరో చెప్పేసిన చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2024 | 6:34 PM

Share

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, బడ్జెట్‌పై చర్చలో భాగంగా.. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు.. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్‌ను వివరించారు. ఇందులో విజన్ 2027 కూడా ప్రకటించారు. అంటే 2027 నాటికి అమరావతి ఎలా ఉండబోతోంది. పోలవరం నిర్మాణం పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. అంతేకాకుండా.. డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని.. మూడేళ్లలో అమరావతికి కచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు. 6, 9, 12, 30నెలల చొప్పున భవనాల నిర్మాణాలకు డెడ్‌లైన్స్‌ తోపాటు.. మూడేళ్లలో 50వేల కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పోలవరం కూడా 2027నాటికే పూర్తి, జాతికి అంకితం చేస్తామని.. సభలో విజన్ 2047తోపాటే 2027లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు..

వీడియో చూడండి..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వచ్చే ఎన్నికల గురించి, సీఎం ఎవరు ఉంటారన్నదానిపై కూడా క్లారిటీ చ్చారు.. ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అంటే.. వచ్చే సారి కూడా తానే ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెప్పారు.. సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు 4.0 వెర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు.. ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తంచేశారు. మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు.. కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ 30 ఏళ్లు పాలించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. టీమ్ లీడర్‌గా తాను పనిచేస్తానని.. మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలంతా.. తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేయాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..