AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vyooham Teaser: కించపరిస్తే బట్టలూడదీసి కొడతాం.. ఆర్జీవీ ‘వ్యూహం’పై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు ఫైర్..

APPCC Chief Gidugu Rudra Raju : రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వ్యూహం.. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా ఏపీ రాజకీయాలే లక్ష్యంగా.. వర్మ వ్యూహం సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.

Vyooham Teaser: కించపరిస్తే బట్టలూడదీసి కొడతాం.. ఆర్జీవీ ‘వ్యూహం’పై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు ఫైర్..
Gidugu Rudra Raju
Shaik Madar Saheb
|

Updated on: Jun 25, 2023 | 11:59 AM

Share

APPCC Chief Gidugu Rudra Raju : రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వ్యూహం.. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా ఏపీ రాజకీయాలే లక్ష్యంగా.. వర్మ వ్యూహం సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉమ్మడి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నాటినుంచి మొదలుకొని.. చంద్రబాబు సీఎం అవ్వడం.. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టడం.. ఇలా ఎన్నో పొలిటికల్ స్టంట్లతో వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలనే వ్యూహం టీజర్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ టీజర్ వచ్చి రాగానే.. అటు ఏపీ రాజకీయాల్లో సెన్సెషనల్ అవ్వడంతోపాటు ఇటు జాతీయ పార్టీ నుంచి ఆగ్రహానికి గురవుతోంది. వర్మ వ్యూహంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుదర్రాజు ఫైర్ అయ్యారు. సంచలనం కోసం.. ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చూపించే వర్మ అంటూ గిడుగు రుదర్రాజు సీరియస్‌గా హెచ్చరించారు. సోనియాను కించపరిస్తే వర్మను బట్టలూడదీసి కొడతాం.. గాంధీ, నెహ్రుల కుటుంబాన్ని విమర్శిస్తే ఖబడ్దార్‌.. అంటూ వర్మపై గిడుగు ఫైర్ అయ్యారు. సంచలనాల కోసమే ఆర్జీవీ ఇదంతా చేస్తున్నారు.. కావాలనే లేనివి…ఉన్నవిగా చూపిస్తున్నారన్నారు.

కాంట్రవర్శీ డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆర్జీవీ రిలీజ్‌ చేసిన వ్యూహం టీజర్‌ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ టీజర్‌లో కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కించపరిచే విధంగా తీశారని ఆరోపిస్తున్నారు ఏపీ కాంగ్రెస్‌ నేతలు. ఆర్జీవీ రిలీజ్‌ చేసిన వ్యూహం టీజర్‌లో అప్పటి కాంగ్రెస్‌ అధిష్ఠానం, జగన్‌ను బెదిరించినట్లు టీజర్‌లో చూపించారు. అంతేకాదు.. జగన్‌ తలొగ్గపోవడంతోనే సీబీఐ కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టినట్లు వర్మ టీజర్‌లో చూపారు.

ఇదే ఏపీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ నేతలకు మింగుడు పడటం లేదు. సోనియాగాంధీని వర్మ విలన్‌గా చూపేట్టే ప్రయత్నం చేశారని గిడుగు రుద్రరాజు సహా ఇతర కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..