AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇంద్రకీలాద్రిపై ఇక నుంచి కొత్త విధానం.. ఏంటంటే?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కోసం మరో కీలక మార్పు అమల్లోకి వచ్చింది. 2026 నూతన సంవత్సరానికి అడుగుపెడుతున్న తరుణంలో కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంతో దుర్గగుడి ఆలయ పాలకమండలి, ఎండోమెంట్ యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది.

Vijayawada: దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇంద్రకీలాద్రిపై ఇక నుంచి కొత్త విధానం.. ఏంటంటే?
Vijayawada Kanakadurgamma Temple
M Sivakumar
| Edited By: |

Updated on: Dec 31, 2025 | 11:03 AM

Share

భక్తుల సౌకర్యార్థం విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు సరికొత్తి నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇంద్రకీలాద్రి ఆలయంలో కూడా ఉచిత లడ్డు ప్రసాద విధానాన్ని ప్రారంభించారు. 500 రూపాయల మంత్రాలయ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఇకపై లడ్డు ప్రసాదాన్ని నేరుగా టికెట్ స్కానింగ్ వద్దనే ప్రసాదం అందజేయమన్నారు. దర్శనానికి వెళ్లే సమయంలోనే భక్తులకు ప్రసాదం అందించడంతో ప్రక్రియ మరింత సులభంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

టికెట్ స్కాన్ అయిన వెంటనే లడ్డు అందజేయడం ద్వారా ప్రసాద పంపిణీలో పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా టికెట్ల దుర్వినియోగానికి చెక్‌ పెట్టడంతో పాటు ఆలయ ఆదాయం నిర్వహణలో స్పష్టత పెరుగుతుందని పేర్కొన్నారు. గతంలో దర్శనం పూర్తయిన తర్వాత ప్రసాదం కోసం కౌంటర్ల వద్దకు వెళ్లి భక్తులు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం కొత్త విధానం అమలులో ఆ ఇబ్బంది పూర్తిగా తొలగిపోతుందని అధికారులు చెబుతున్నారు.

 Vijayawada Kanakadurgamma Temple

 

స్కానింగ్ పాయింట్ వద్దే లడ్డు పంపిణీ చేయడం వల్ల ప్రతి భక్తులకు ఉచిత ప్రసాదం అందేలా పర్యవేక్షణ ఉంటుందని.. ఒక్కో టికెట్‌కు నిర్ణీత సంఖ్యలో లడ్డూలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సాధించవచన్నారు. ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టిన ఆలయ చైర్మన్ గాంధీ , ఈవో శీనా నాయక్ లకు భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

దుర్గ గుడి ఆలయంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో ఈ నిర్ణయం ఒక కీలక అడుగుగా మారనుందని అధికారులు చెబుతున్నారు. అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ప్రశాంతమైన , ఆధ్యాత్మిక అనుభూతి కలిగించడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.