Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Kumar Yadav: ఆనం గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

Nellore Politics: ఏపీలోని నెల్లూరులో రాజకీయాలు మరింత హీటెక్కాయి.. ఓవైపు టీడీపీ యువగళం పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు, ఆనంరాంనారాయణరెడ్డి సవాల్.. అంతేధీటుగా వీరిద్దరికీ కౌంటర్ ఇస్తూ మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్..

Anil Kumar Yadav: ఆనం గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..
Anil Kumar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 25, 2023 | 11:09 AM

Nellore Politics: ఏపీలోని నెల్లూరులో రాజకీయాలు మరింత హీటెక్కాయి.. ఓవైపు టీడీపీ యువగళం పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు, ఆనంరాంనారాయణరెడ్డి సవాల్.. అంతేధీటుగా వీరిద్దరికీ కౌంటర్ ఇస్తూ మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్.. ఇలా నెల్లూరు పాలిటిక్స్ గరంగరంగా మారాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఆనంరాంనారాయణ రెడ్డికి సవాల్ చేశారు. ఆనం రాంనారాయణ రెడ్డి తనపై పోటీ చేసి గెలవాలంటూ అనిల్ కుమార్ పేర్కొన్నారు.

2024లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలి.. ఓడిపోతే 44 ఏళ్లకే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అంటూ అనిల్ యాదవ్ సవాల్ చేశారు. దమ్ముంటే టీడీపీ నుంచి టిక్కెట్ తెచ్చుకోవాలని ఛాలెంజ్ కూడా చేశారు.. నెల్లూరులో ఎక్కడ నుంచైనా పోటీ చేసే సత్తా ఉందంటున్నావు.. నీది పెద్ద కుటుంబం, బచ్చా గాడి మీద పోటీ చేసి గెలువు అంటూ ఫైర్ అయ్యారు.

ఆనం ఎక్కడా పోటీ చేసినా గెలవరని.. టీడీపీని సైతం వదిలేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో వైసీపీలో కలుపు మొక్కలుగా ఉన్న ముగ్గురిని పీకి పారేసారని.. వచ్చే ఎన్నికల్లో పది స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

నెల్లూరు నుంచే పోటీ చేస్తా.. ఆనం

తాను నెల్లూరు నుంచే పోటీ చేస్తానని.. ఆనం రాంనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తాను నెల్లూరు నుంచి గెలిచే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చానని.. టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?