AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: నేడు రాజోలు నియోజక వర్గ నేతలు, ప్రతినిధులతో పవన్ సమావేశం.. సాయంత్రం మలికిపురంలో సభలో ప్రసంగం..

పవన్ కళ్యాణ్ పర్యటన, సభ అంటే యువత అని అనే వ్యాఖ్యలకు చెక్ పెడుతూ.. ఈసారి పవన్ పర్యటన, సభలకు వృద్ధుల సహా అన్ని వయసులవారు హాజరవుతున్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ర్యాలీగా వెళ్తుంటే.. మహిళలు అడుగడుగునా హారతులు ఇస్తున్నారు. అత్యంత భారీ జనం మధ్య వారాహి యాత్ర ముందుకు కదలడానికి అధిక సమయం పడుతోంది.

Pawan Kalyan: నేడు రాజోలు నియోజక వర్గ నేతలు, ప్రతినిధులతో పవన్ సమావేశం.. సాయంత్రం మలికిపురంలో సభలో ప్రసంగం..
Pawan Kalyan
Surya Kala
|

Updated on: Jun 25, 2023 | 9:54 AM

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కోనసీమ జిల్లాలో జరుగుతోంది. వారాహి యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన, సభ అంటే యువత అని అనే వ్యాఖ్యలకు చెక్ పెడుతూ.. ఈసారి పవన్ పర్యటన, సభలకు వృద్ధుల సహా అన్ని వయసులవారు హాజరవుతున్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు ర్యాలీగా వెళ్తుంటే.. మహిళలు అడుగడుగునా హారతులు ఇస్తున్నారు. అత్యంత భారీ జనం మధ్య వారాహి యాత్ర ముందుకు కదలడానికి అధిక సమయం పడుతోంది. ప్రస్తుతం గత ఎన్నికల్లో జనసేనకు ఎమ్మెల్యేని ఇచ్చిన రాజోలు నియోజక వర్గంలో జనసేనాని ఉన్నారు. దిండి రాసార్ట్స్‌లో పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ నేతలతో పాటు, పలు జనసేన శ్రేణులతో సమావేశం నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు.

మరోవైపు సాయంత్రం మలికిపురంవారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జనసేన నేతలు, శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఉదయం రాజోలు నియోజకవర్గ నాయకులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం నుంచి రోడ్ షో నిర్వహిస్తూ పవన్ మలికిపురం సెంటర్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వాస్తవంగా మలికిపురంలో శనివారం జరగాల్సిన వారాహి బహిరంగ సభ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు  జనసేన ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..