Rain Alert: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. మరో అల్పపీడనం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
నిన్నటి నైరుతి బంగాళాఖాతం - దానికి ఆనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ - దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. అంతేకాకుండా అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.. వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి నైరుతి బంగాళాఖాతం – దానికి ఆనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ – దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. అలాగే.. దక్షిణ అండమాన్ సముద్రం – దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో, 2025 అక్టోబర్ 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది.
అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ – యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-
శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ:-
శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




