ఉపరితల ఆవర్తనంతో ఏపీ,తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. భారత్ నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి.. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ముగిసింది.
ఇప్పుడు ఈశాన్య రుతుపవనాల వంతు వచ్చింది. ఈ రుతుపవనాల ప్రభావంతో.. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలంగాణపైనా ఉంది. మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు పడతాయి. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, నల్గొండ, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. శనివారం నాడు నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు పడతాయన్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాని ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బర్త్ డే సర్‌ప్రైజ్
బిగ్ బాస్‌కు బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి వల్ల పీకల్లోతు చిక్కుల్లో షో
అవాక్కయే న్యూస్… వేణు ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవి
Telusu Kada: రాసుకున్నంత ఈజీ కాదు.. సినిమా తీయడం! హిట్టా..? ఫట్టా..?
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

