AP Weather Alert: ఏపీకి వాతావరణ సూచన.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..

AP Weather Alert: నైరుతిబంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5 .8 కిలోమీటర్లు ఎత్తులో వ్యాపించిఉంది. దీని ఫలితంగా రాగల..

AP Weather Alert: ఏపీకి వాతావరణ సూచన.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
Ap Weather Report
Follow us
Surya Kala

|

Updated on: Jan 10, 2022 | 1:33 PM

AP Weather Alert: నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5 .8 కిలోమీటర్లు ఎత్తులో వ్యాపించిఉంది. దీని ఫలితంగా రాగల మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఏ విధంగా ఉంటుందో వాతవరణ శాఖ ప్రకటించింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర:  ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ: ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

Also Read:  శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కరోనా నిబంధనలను మరింత కఠినం చేసిన టీటీడీ..