AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ జనాలకు వాతావరణ శాఖ వార్నింగ్.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు..

Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ గురువారం నాటికి..

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ జనాలకు వాతావరణ శాఖ వార్నింగ్.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు..
Ap Rains
Shiva Prajapati
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 16, 2021 | 7:20 PM

Share

Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ గురువారం నాటికి దాదాపు దక్షిణ కోస్తా – ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం నాడు కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక గురువారం నాడు దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు. గురువారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

తిరుమల నడకదారి మూసివేత.. ఇదిలాఉంటే.. 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రేపు, ఎల్లుండి తిరుమల నడకదారిని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 17,18 తేదీల్లో భారీ వర్షాల ఉంటాయన్న హెచ్చరికలతో నడక మార్గంలో భక్తులను అనుమతించమని టీటీడీ వెల్లడించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే తిరుమల నడకమార్గాలను మూసివేయనున్నట్లు తెలిపింది.

Also read:

Hair Care Tips: జుట్టు సమస్యకు చెక్ పెట్టేందుకు హోంమేడ్ హెయిర్ మాస్క్‌.. వివరాలు ఇవే..

Uganda Para Badminton International 2021: భారత ఆటగాళ్లు తప్పిన ప్రమాదం.. హోటల్ వద్ద బాంబు పేలుడు..!

Video Viral: మొసలిని కౌగిలించుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..