AP Politics – Ycp : అలా అనేందుకు నోరెలా వచ్చింది.. బీజేపీ నేతకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్..

Andhra Pradesh News: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..

AP Politics - Ycp : అలా అనేందుకు నోరెలా వచ్చింది.. బీజేపీ నేతకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్..
Kanna Babu
Follow us
Shiva Prajapati

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 16, 2021 | 7:20 PM

Andhra Pradesh News: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను జగన్ ప్రభుత్వం ఆదుకుందన్నారు. తుపాను బాధితులకు పంట నష్ట పరిహారం కింద రూ. 22 కోట్లు సీఎం జగన్ అందించారని అన్నారు. ఇప్పటి వరకు పంట నష్టం కింద 13.96 లక్షల మందికి రూ.1,071 కోట్లు ఇచ్చారని వెలలడించారు. చంద్రబాబు హయాంలో పంట నష్టం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. అసలు నష్ట పరిహారం అందుతుందో లేదో కూడా తెలిసేది కాదని అన్నారు. తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు ప్రచార హడావుడి తప్ప సహాయం చేసేది శూన్యం అని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టంపై అంచనాలను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు.

రైతులకు సంబంధించి బీజేపీ నేత సోము వీర్రాజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారని మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. రైతులకు తాము ఏ సాయం చేయడంలో విఫలం అయ్యామో సోము వీర్రాజు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ‘మా ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నోరెలా వచ్చింది?’ అంటూ ఫైర్ అయ్యారు. మరి రైతులకు కేంద్రం మేలు చేస్తుంటే.. పొరుగు రాష్ట్రాల్లో రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. రైతుల విషయాన్ని రాజకీయాలు చేయొద్దని హితవుచెప్పారు.

ఇదే సమయంలో చంద్రబాబుపైనా మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కుప్పంలో మార్పు మొదలైందని, అందుకే చంద్రబాబు కట్టు కథలు అల్లుతున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు వేశారని పిచ్చి ప్రచారం చేస్తున్నారని తోసిపుచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో విపక్ష పార్టీల ఏజెంట్లు ఉండగా.. దొంగ ఓట్లు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో వైసపీ క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు మంత్రి కన్నబాబు. అది గమనించిన చంద్రబాబు.. ఇప్పటి నుంచే కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు గ్రాఫిక్స్ చూపించి అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబు అని మంత్రి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అండ్ కో కి రైతులపై ఉన్న ప్రేమ కాదని, రియల్ ఎస్టేట్‌పై ప్రేమ అని వ్యాఖ్యానించారు. ‘మూడు రాజధానులు మా తరమో కాదో మీరే చూస్తారు.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం. కచ్చితంగా రాష్ట్రంలో మూడు రాజధానులు వస్తాయి.’ అని మంత్రి కన్నబాబు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం కల మాత్రమే అని ఎద్దేవా చేశారు. అమరావతికి మద్ధతు ఇస్తున్న బీజేపీ అదే ప్రాంతానికి పరిమితం అయిపోతామంటే వాళ్ల ఇష్టం అని మంత్రి వ్యాఖ్యానించారు.

Also read:

IND vs NZ: 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు.. రోహిత్ శర్మ తుఫాను ఇన్నింగ్స్.. భయపడుతోన్న కివీ బౌలర్లు..!

Watch Video: రఫెల్ నాదల్‌కు 97 ఏళ్ల వృద్ధుడి సవాల్.. టెన్నిస్ కోర్టులో తలపడిన ఇరువురు.. వైరలవుతోన్న వీడియో..!

Viral Video: అమ్మబాబోయ్.! భయంకర సాలీడుగా మారిన శునకం.. కుక్కను చూసి బెదిరిపోతున్న జనం.. వైరల్ వీడియో!