Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రఫెల్ నాదల్‌కు 97 ఏళ్ల వృద్ధుడి సవాల్.. టెన్నిస్ కోర్టులో తలపడిన ఇరువురు.. వైరలవుతోన్న వీడియో..!

టెన్నిస్ ఆడుతోన్న 97 ఏళ్ల వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పేరు లియోనిడ్ యాకోవ్లెవిచ్ స్టానిస్లావ్స్కీ. ఈ వీడియోలో లియోనిడ్ వెటరన్ ప్లేయర్ రాఫెల్ నాదల్‌తో..

Watch Video: రఫెల్ నాదల్‌కు 97 ఏళ్ల వృద్ధుడి సవాల్.. టెన్నిస్ కోర్టులో తలపడిన ఇరువురు.. వైరలవుతోన్న వీడియో..!
Rafael Nadal
Follow us
Venkata Chari

|

Updated on: Nov 16, 2021 | 5:00 PM

Rafael Nadal: టెన్నిస్ ఆడుతోన్న 97 ఏళ్ల వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పేరు లియోనిడ్ యాకోవ్లెవిచ్ స్టానిస్లావ్స్కీ. ఈ వీడియోలో లియోనిడ్ వెటరన్ ప్లేయర్ రాఫెల్ నాదల్‌తో కలిసి టెన్నిస్ ఆడుతున్నట్లు కనిపించడమే ఇందుకు కారణం. నాదల్ స్పెయిన్‌కు చెందినవాడని తెలిసిందే. అక్కడే టెన్నిస్ అకాడమీని కలిగి ఉన్నాడు.

లియోనిడ్‌కు నాదల్‌ను కలవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందంట. దీంతో లియోనిడ్ 20 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత నాదల్‌నె కలిసి ఓ మ్యాచ్‌ కూడా ఆడాడు. బీబీసీ ప్రకారం, లియోనిడ్ 22 మార్చి 1924న జన్మించాడు. ఆయన ఉక్రెయిన్‌కు చెందినవాడని పేర్కొంది.

స్పెయిన్ వెళ్లిన లియోనిడ్.. 97 సంవత్సరాల వయస్సులో, లియోనిడ్ సీనియర్ ప్లేయర్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి స్పెయిన్ వెళ్ళాడు. అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఎక్కువ వయసు గల టెన్నిస్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. లియోనిడ్ 50 సంవత్సరాలకు పైగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాడు. అతను ప్రపంచంలోనే అత్యంత వృద్ధ టెన్నిస్ ప్లేయర్‌గా ఇక్కడ ఆడుతున్నాడు.

టెన్నిస్ ఆడేందుకు వయస్సుతో పనిలేదు.. టెన్నిస్ అద్భుతమైన ఆట అని లియోనిడ్ పేర్కొన్నాడు. ‘ఇది శారీరక వ్యాయామం. మీరు ఏ వయసులోనైనా టెన్నిస్ ఆడవచ్చు. నేను ఆడటం ప్రారంభించినప్పుడు నాకు 30 సంవత్సరాలు. ప్రస్తుతం నేను 97 సంవత్సరాల వయస్సులో కూడా చాలా ఆనందంగా ఆడుతున్నాను. నేను 100 సంవత్సరాలు టెన్నిస్ ఆడాలనుకుంటున్నాను. నాకు వయస్సు ఒక సంఖ్య మాత్రమే’ అని పేర్కొన్నాడు.

ఆయన తన ప్రయాణంలో లియోనిడ్ నాదల్ మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని కూడా పొందాడు. ఇక్కడ నాదల్ ఇప్పటివరకు గెలిచిన అన్ని ట్రోఫీలను నిశితంగా పరిశీలించాడు. నాదల్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 36 ATP మాస్టర్స్ టైటిల్స్‌తో పాటు మొత్తం 1000 ట్రోఫీలు ఈ మ్యూజియంలో ఉంచారు.

Also Read: Pakistan Cricket Team: వివాదంలో పాకిస్తాన్ ఆటగాళ్లు.. సిరీస్‌ను రద్దు చేయాలంటోన్న బంగ్లా అభిమానులు.. అసలేం జరిగిందంటే?

Watch Video: 24 ఏళ్ల కెరీర్‌ను భావోద్వేగంతో ముగించిన లిటిల్ మాస్టర్.. వైరలవుతోన్న వీడియో..!