AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Cricket Team: వివాదంలో పాకిస్తాన్ ఆటగాళ్లు.. సిరీస్‌ను రద్దు చేయాలంటోన్న బంగ్లా అభిమానులు.. అసలేం జరిగిందంటే?

టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సిరీస్ ప్రారంభం కాకముందే రచ్చ మొదలైంది.

Pakistan Cricket Team: వివాదంలో పాకిస్తాన్ ఆటగాళ్లు.. సిరీస్‌ను రద్దు చేయాలంటోన్న బంగ్లా అభిమానులు.. అసలేం జరిగిందంటే?
Pakistan Cricket Team
Venkata Chari
|

Updated on: Nov 16, 2021 | 4:15 PM

Share

PAK vs BAN: టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సిరీస్ ప్రారంభం కాకముందే రచ్చ మొదలైంది. వాస్తవానికి, పాకిస్తాన్ కోచ్ సక్లైన్ ముస్తాక్ తన ఆటగాళ్లను ప్రోత్సహించడానికి శిక్షణా శిబిరంలో పాకిస్తాన్ జెండాను ఉంచాడు. దీంతో అసలు వివాదం మొదలైంది. ప్రాక్టీస్‌కు జెండాతో రావడం ఏంటని బంగ్లాదేశ్ అభిమానులు కోపంగా ఉన్నారు. ఈ సిరీస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు.

కోపోద్రిక్తులైన బంగ్లాదేశ్ అభిమానులు.. శిక్షణా శిబిరంలో పాకిస్థాన్ జెండాను చూసిన బంగ్లాదేశ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గో బ్యాక్ పాకిస్థాన్… బంగ్లాదేశ్ ఈ సిరీస్‌ను రద్దు చేయాలి. అలాగే బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ జెండాను కూడా నిషేధించాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘చాలా దేశాలు బంగ్లాదేశ్‌తో ఆడటానికి వస్తాయి. సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ప్రాక్టీస్ చేస్తాయి. కానీ, ఈ రోజు ముందు ఏ దేశం శిక్షణా శిబిరంలో తన జాతీయ జెండాను ఎగురవేయలేదు. అయితే పాకిస్థాన్ ఇలా ఎందుకు చేసింది.. ఏం చూపించాలనుకుంటోంది’ అంటూ ఘాటుగా మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.

ప్రపంచకప్‌లో ట్రెండ్‌ మొదలైంది. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా పాక్‌ జట్టు ప్రధాన కోచ్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ శిక్షణ శిబిరంలో పాక్‌ జెండాను పాతి ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేలా చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌ టూర్‌లోనూ ముస్తాక్‌ దీన్ని కొనసాగించాడు.

మూడు టీ20ఐలు, రెండు టెస్టులు.. నవంబర్ 19, 20, 22 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. తొలి టెస్టు నవంబర్ 26 నుంచి 30 వరకు (చిట్టగాంగ్) జరగనుండగా, రెండో టెస్టు డిసెంబర్ 4 నుంచి 6 వరకు ఢాకాలో జరగనుంది.

పాకిస్థాన్ టెస్టు జట్టు బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబిద్ అలీ, అజర్ అలీ, బిలాల్ ఆసిఫ్, ఫహీమ్ అష్రఫ్, ఫవాద్ ఆలం, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులాం, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ షా ఆఫ్రిది, జాహిద్ మహమూద్.

Also Read: Watch Video: 24 ఏళ్ల కెరీర్‌ను భావోద్వేగంతో ముగించిన లిటిల్ మాస్టర్.. వైరలవుతోన్న వీడియో..!

IND vs NZ Schedule: రేపటి నుంచే భారత్ వర్సెస్ కివీస్ టీ20 పోరు.. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌లకు కీలకం కానున్న తొలి సిరీస్