Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు.. రోహిత్ శర్మ తుఫాను ఇన్నింగ్స్.. భయపడుతోన్న కివీ బౌలర్లు..!

Rohit Sharma: భారత్-న్యూజిలాండ్ టీంల (India vs New Zealand, 1st T20) మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జైపూర్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.

IND vs NZ: 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు.. రోహిత్ శర్మ తుఫాను ఇన్నింగ్స్.. భయపడుతోన్న కివీ బౌలర్లు..!
Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Nov 16, 2021 | 5:08 PM

India vs New Zealand: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించడమే ఇరు జట్ల లక్ష్యంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలనుకునే టీంలు బ్యాటింగ్ రాణిస్తే చాలు.. విజయం సొంతం అవనుంది. ఎందుకంటే సవాయ్ మాన్ సింగ్ స్టేడియం పిచ్ ఫ్లాట్‌గా ఉంది. అయితే ఈ పిచ్‌లో పరుగుల వరద పారనుందని తెలుస్తోంది. అయితే తొలి మ్యాచుకు వరుణుడు అడ్డు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు భారీ వర్షం కురిసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.

సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో చివరిసారిగా భారత జట్టు ఆస్ట్రేలియా టీంతో తలపడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికి ఆరేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 359 పరుగులు చేసినప్పటికీ ఓడిపోవడం విశేషం. కంగారూ బౌలర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్‌లను చితక్కొట్టారు. విరాట్ కోహ్లీ కేవలం 52 బంతుల్లో సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 123 బంతుల్లో 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. శిఖర్ ధావన్ కూడా 86 బంతుల్లో 95 పరుగులు సాధించాడు.

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ ఆడటం లేదు. కానీ, రోహిత్ శర్మ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఫీల్డింగ్‌లోకి దిగబోతున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు రోహిత్ శర్మను త్వరగా పెవిలియన్ పంపేందుకు ప్లాన్ చేసుకోవాలి. లేదంటే జైపూర్‌లో రోహిత్ శర్మ సిక్సర్లు, ఫోర్లు కొట్టి బౌలర్లపై విరుచకపడే అవకాశం ఉంది. జైపూర్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అతని బ్యాట్ నుంచి 21 బౌండరీలు వచ్చాయి. సిక్సర్లు, ఫోర్లతో 92 పరుగులు సాధించాడు. శిఖర్ ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 26.1 ఓవర్లలో 176 పరుగులు జోడించిన రోహిత్ శర్మ ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి 104 బంతుల్లో 186 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 360 పరుగుల లక్ష్యాన్ని 39 బంతుల్లోనే టీమిండియా ఛేదించింది. ఈ స్కోర్‌కార్డ్‌ చూస్తే కంగారూ బౌలర్లను ఎంతలా ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

న్యూజిలాండ్ జట్టు కూడా ఈ మ్యాచ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటుంది. రోహిత్ శర్మను ఔట్ చేయడానికి ప్రత్యేక వ్యూహం కూడా చేస్తుందని నమ్ముతారు. కాగా, న్యూజిలాండ్ జట్టు కూడా ఫామ్‌లో ఉంది. టీ20 వరల్డ్ కప్ 2021లో, న్యూజిలాండ్ ఫైనల్‌కు వెళ్లింది. అయితే టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Also Read: Watch Video: రఫెల్ నాదల్‌కు 97 ఏళ్ల వృద్ధుడి సవాల్.. టెన్నిస్ కోర్టులో తలపడిన ఇరువురు.. వైరలవుతోన్న వీడియో..!

Pakistan Cricket Team: వివాదంలో పాకిస్తాన్ ఆటగాళ్లు.. సిరీస్‌ను రద్దు చేయాలంటోన్న బంగ్లా అభిమానులు.. అసలేం జరిగిందంటే?