T20 World Cup: 2024 టీ20 ప్రపంచ కప్ ఆదేశంలోనే.. 2031 వరకు నిర్వహించే దేశాల లిస్టు రెడీ.. భారత్‌లో మూడు మెగా ఈవెంట్‌లు..!

ICC: 2024 నుంచి 2031 మధ్య జరిగే ప్రధాన ఐసీసీ పురుషుల పరిమిత ఓవర్ల ఈవెంట్స్‌ ఆతిథ్యం ఇచ్చే దేశాలను నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు నేడు ఐసీసీ నేడు ఓ ప్రకటనను విడుదల చేసి ఆయా దేశాలను, అక్కడ జరిగే టోర్నీలను వెల్లడించింది.

T20 World Cup: 2024 టీ20 ప్రపంచ కప్ ఆదేశంలోనే.. 2031 వరకు నిర్వహించే దేశాల లిస్టు రెడీ.. భారత్‌లో మూడు మెగా ఈవెంట్‌లు..!
Icc World Cup 2021 Prize Money
Follow us
Venkata Chari

|

Updated on: Nov 16, 2021 | 6:02 PM

USA to stage 2024 T20 World Cup: 2024 నుంచి 2031 మధ్య జరిగే ప్రధాన ఐసీసీ పురుషుల పరిమిత ఓవర్ల ఈవెంట్స్‌ ఆతిథ్యం ఇచ్చే దేశాలను నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు నేడు ఐసీసీ నేడు ఓ ప్రకటనను విడుదల చేసి ఆయా దేశాలను, అక్కడ జరిగే టోర్నీలను వెల్లడించింది. జూన్ 2024లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ అనుకున్నట్లుగానే తొలిసారి యూఎస్‌ఏకి వెళ్లింది. 2010లో టోర్నమెంట్‌ని నిర్వహించిన వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏ ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది.

ఎనిమిది నెలల తర్వాత అంటే ఫిబ్రవరి 2025లో పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది 1996లో భారతదేశం, శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చాయి. దీని తరువాత పాకిస్తాన్‌లో ఆడబోయే మొదటి అతిపెద్ద ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం.

2026లో భారత్, శ్రీలంకలో పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో మరొక మొదటి ప్రధాన ఈవెంట్‌కు ముందు ఈ టోర్నీ జరగనుంది.

అక్టోబర్/నవంబర్ 2027లో జింబాబ్వే‌తో దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలు మొదటిసారిగా పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే చివరిగా 2003లో ఈ ఈవెంట్‌ను నిర్వహించాయి. అక్టోబర్ 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. 12 నెలల తర్వాత భారతదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది.

ఇక 2030లో ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్‌ దేశాల్లో టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య బాధ్యతలను పంచుకుంటాయని తెలిసింది. 1999 తర్వాత ఐర్లాండ్, స్కాట్లాండ్‌లు అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. చివరి షెడ్యూల్ ఈవెంట్‌లో భాగంగా అక్టోబర్/నవంబర్ 2031లో, పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ భారత్, బంగ్లాదేశ్‌ దేశాల్లో జరగనుంది.

Host/s Date Comp
West Indies & USA June 2024 ICC Men’s T20 World Cup
Pakistan February 2025 ICC Men’s Champions Trophy
India & Sri Lanka February 2026 ICC Men’s T20 World Cup
South Africa, Zimbabwe & Namibia October/November 2027 ICC Men’s Cricket World Cup
Australia & New Zealand October 2028 ICC Men’s T20 World Cup
India October 2029 ICC Men’s Champions Trophy
England, Ireland & Scotland June 2030 ICC Men’s T20 World Cup
India & Bangladesh October/November 2031 ICC Men’s Cricket World Cup

Also Read: Uganda Para Badminton International 2021: భారత ఆటగాళ్లు తప్పిన ప్రమాదం.. హోటల్ వద్ద బాంబు పేలుడు..!

IND vs NZ: 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు.. రోహిత్ శర్మ తుఫాను ఇన్నింగ్స్.. భయపడుతోన్న కివీ బౌలర్లు..!